Skip to main content

Vikram Misri: విదేశాంగ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన విక్రమ్‌ మిస్రీ

దౌత్యవేత్త విక్రమ్ మిశ్రీ జూలై 15వ తేదీ విదేశాంగ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
Vikram Misri Assumes Charge as Foreign Secretary of India

ఇండియన్ ప్యారీస్ సర్వీస్ 1989 బ్యాచ్ చెందిన అయన ఈ పదవి చేపట్టిన 35వ అధికారి. వినయ్ క్వాట్రా స్థానంలో అయన బాధ్యతలు చేపట్టారు. తూర్పు లడఖ్ సరిహద్దు వివాదం దరిమిలా చైనాతో దెబ్బ తిన్న సంబంధాలు, రష్యా, ఉక్రెయిన్ పోరు పరిణామాలు సహా వివిధ భౌగోళిక, రాజకీయ సవాళ్లను అధిగమించాలని భారత్ చూస్తున్న సమయంలో 59 ఏళ్ల మిశ్రీ ఈ కీలక పదవిని చేపట్టారు.

ఆయన గతంలో మిశ్రీ విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ), ప్రధాని కార్యాలయంలోను, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఉత్తర అమెరికాలో వివిధ భారత రాయబార కార్యాలయాల్లోను వివిధ హోదాల్లో సేవలు అందించారు. ఆయన ముగ్గురు ప్రధానులు ఇంద్ర కుమార్ గుజ్రాల్, మన్మోహన్ సింగ్, నరేంద్ర  మోదీలకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. 2019 నుంచి 2021 వరకు చైనాలో భారత రాయబారిగా గాల్వాన్ లోయ ఘర్షణలు, ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వైపాక్షిక చర్యల్లో కీలక పాత్ర పోషించారు.

CBDT Chief : సీబీడీటీ చీఫ్‌గా రవి అగర్వాల్‌

Published date : 17 Jul 2024 09:57AM

Photo Stories