Skip to main content

CBDT Chief : సీబీడీటీ చీఫ్‌గా రవి అగర్వాల్‌

Ravi Agarwal as New Chief of Central Board of Direct Taxes

ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) నూతన చైర్మన్‌గా రవి అగర్వాల్‌ నియమితులయ్యారు. ఆయన 1988 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి. ప్రస్తుతం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న నితిన్‌ గుప్తా స్థానంలో రవి నియామకం జరిగింది. సీబీడీటీ చీఫ్‌గా జూన్‌ 2022లో నియమితులైన గుప్తా గతేడాది సెప్టెంబర్‌లోనే పదవీ విరమణ చేయాల్సింది. అయితే ఆయ­న పదవీ కాలాన్ని ప్రభుత్వం తొమ్మిది నెలలు పొడిగించింది. దీంతో జూన్‌ 30న పదవీ విరమణ చేశారు.

Miss Supranational: మిస్‌ సుప్రానేషనల్‌ టైటిల్‌ని దక్కించుకున్న ఇండోనేషియా బ్యూటీ.. 12వ స్థానంలో నిలిచిన‌ భారతీయురాలు!

Published date : 10 Jul 2024 10:20AM

Photo Stories