Skip to main content

Miss Supranational: మిస్‌ సుప్రానేషనల్‌ టైటిల్‌ని దక్కించుకున్న ఇండోనేషియా బ్యూటీ.. 12వ స్థానంలో నిలిచిన‌ భారతీయురాలు!

మిస్‌ సుప్రానేషనల్‌ 2024 అందాల పోటీలు పోలాండ్‌లోని మలోపోల్స్కాలో జరిగాయి.
Harashta Haifa Zahra crowned Miss Supranational 2024

ఆ పోటీల్లో భారతదేశానికి చెందిన సోనాల్‌ కుక్రేజాతో సహా 68 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో సోనాల్‌ 12వ స్థానంలో నిలిచింది. 

సోనాల్ కుక్రేజా ఢిల్లీలోని జైపూర్‌లో జన్మించి, యుఎస్‌ఏలోని పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీలో మార్కెటింగ్ అండ్‌ పబ్లిక్ రిలేషన్స్ అభ్యసించింది. ఆమె ఒక స్టార్టప్ యునికాన్ వ్యవస్థాపకురాలు, కొత్త క్రిప్టో సేవలతో భారత ఆర్థిక వ్యవస్థను విప్లవాత్మకంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహిళల సామాజిక నిబంధనలను ఛేదించి ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించాలని ఆమె ప్రోత్సహిస్తుంది. గతంలో ఆమె లైవా మిస్‌ దివా సుప్రానేషనల్‌ 2023 టైటిల్‌ను కూడా గెలుచుకుంది. 

టైటిల్‌ని దక్కించుకున్న ఇండోనేషియా బ్యూటీ
ఈ మిస్‌ సుప్రానేషనల్‌ 2024 టైటిల్‌ని ఇండోనేషియాకు చెందిన హరాష్ట హైఫా జహ్రా సొంతం చేసుకుంది. ఆమె ఇండోనేషియా ఎంట్రెప్రెన్యూర్‌, మోడల్‌, అందాల రాణి. ఆమె గతంలో పుటేరి ఇండోనేషియా 2024 కిరీటాన్ని పొందింది. ఆమె పర్యావరణ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీని కూడా పూర్తి చేసింది. 

Sujata Saunik: తొలి మహిళా సీఎస్‌గా సుజాతా సౌనిక్.. ఏ రాష్ట్రానికంటే..

ఈ జాబితాలో చోటు సంపాదించింది వీరే..
ఈ అందాల పోటీల జాబితాలో ఫిన్‌లాండ్‌కు చెందిన అలెగ్జాండ్రా హన్నుసారి, థాయ్‌లాండ్‌కు చెందిన కసామా సూట్రాంగ్, ప్యూర్టో రికోకు చెందిన ఫియోరెల్లా మదీనా, ఫిలిప్పీన్స్‌కు చెందిన అలెథియా అంబ్రోసియో, దక్షిణాఫ్రికాకు చెందిన బ్రయోనీ గోవెండర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన జెన్నా డైక్‌స్ట్రా, డెన్‌మార్క్ లార్సెన్‌కు చెందిన విక్టోరియా లార్సెన్ ఈ జాబితాలో చోటు సంపాదించారు.

Published date : 08 Jul 2024 07:17PM

Photo Stories