పోలాండ్ టెన్నిస్ స్టార్ హుబెర్ట్ హుర్కాజ్ తన కెరీర్‌లో రెండో మాస్టర్స్ సిరీస్ సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు.
Hubert Hurkacz clinch Shanghai Masters title
ఆదివారం ముగిసిన షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో హుర్కాజ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో 17వ ర్యాంకర్ హుర్కాజ్ 6–3, 3–6, 7–6 (10/8)తో ఏడో ర్యాంకర్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)పై గెలిచాడు. విజేత హుర్కాజ్‌కు 12,62,220 డాలర్ల (రూ. 10 కోట్ల 52 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది.