Shanghai Masters 2023 tennis: షాంఘై ఓపెన్‌లో రన్నరప్‌గా బోపన్న–ఎబ్డెన్ జోడీ
Sakshi Education
ఈ ఏడాది మూడో డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీకి నిరాశ ఎదురైంది.
ఆదివారం జరిగిన షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో బోపన్న–ఎబ్డెన్ ద్వయం రన్నరప్‌గా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జంట 7–5, 2–6, 7–10తో గ్రానోలెర్స్ (స్పెయిన్)–జెబలాస్ (అర్జెంటీనా) ద్వయం చేతిలో ఓడిపోయింది.
Asian Games 2023 badminton: పురుషుల బ్యాడ్మింటన్‌లో భారతకు స్వర్ణం
రన్నరప్‌గా నిలిచిన బోపన్న–ఎబ్డెన్‌లకు 2,31,660 డాలర్ల (రూ. కోటీ 93 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 600 ర్యాంకింగ్ పాయింట్లు... టైటిల్ నెగ్గిన గ్రానోలెర్స్–జెబలాస్‌లకు 4,36,730 డాలర్ల (రూ. 3 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తాజా ఫలితంతో బోపన్న –ఎబ్డెన్ జోడీ టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
Asain Games 2023 Squash: స్క్వాష్ పురుషుల ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం
Published date : 17 Oct 2023 11:19AM