Indian Companies: 15 భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు.. కారణం ఇదే..
ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న మొత్తం 275 కంపెనీలకు సంబంధించి ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో ప్రధానంగా భారత్, చైనా, స్విట్జర్లాండ్, తుర్కియేకు చెందిన సంస్థలు ఉన్నాయి.
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు సైనికపరంగా ప్రత్యేక్షంగా, పరోక్షంగా సాయం చేస్తున్న కంపెనీలపై అమెరికా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 275 కంపెనీలు రష్యాకు సహకరిస్తున్నాయని అమెరికా భావిస్తోంది. దాంతో ఉక్రెయిన్‌కు నష్టం వాటిల్లుతున్నట్లు అమెరికా అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ చర్యలు చేపట్టినట్లు యూఎస్ వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా ఆంక్షలు విధించిన భారత్‌కు చెందిన 15 కంపెనీల జాబితాను విడుదల చేశారు.
India China Border: సరిహద్దు గస్తీపై భారత్–చైనా మధ్య ఒప్పందం
ఆ కంపెనీలు ఇవే..
- అభర్ టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
- డెన్వాస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
- ఎమ్సిస్టెక్
- గెలాక్సీ బేరింగ్స్ లిమిటెడ్
- ఆర్బిట్ ఫిన్‌ట్రేడ్ ఎల్‌ఎల్‌పీ
- ఇన్నోవియో వెంచర్స్
- కేడీజీ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్
- ఖుష్బూ హోనింగ్ ప్రైవేట్ లిమిటెడ్
- లోకేష్ మెషీన్స్ లిమిటెడ్
- పాయింటర్ ఎలక్ట్రానిక్స్
- ఆర్‌ఆర్‌జీ ఇంజినీరింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్
- షార్ప్‌లైన్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్
- శౌర్య ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్
- శ్రీఘీ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్
- శ్రేయ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్
BRICS Summit 2024: రష్యాలో జరిగిన 16వ బ్రిక్స్ సదస్సు.. దీని ముఖ్యాంశాలు ఇవే..