Skip to main content

BRICS Summit 2024: రష్యాలో జరిగిన 16వ బ్రిక్స్ సదస్సు

అక్టోబ‌ర్ 22, 23 తేదీల్లో రష్యా దేశంలోని కజాన్ వేదికగా 16వ బ్రిక్స్ సమ్మిట్ జరిగింది.
16th BRICS Summit in Russia

ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబ‌ర్ 24వ తేదీ బ్రిక్స్ సదస్సులో ప్రసంగిస్తూ సమస్యల పరిష్కారం కోసం చర్చలు, దౌత్య మార్గాలే శ్రేయస్కరమని స్పష్టం చేశారు. "యుద్ధానికి కాదు, చర్చలకు మద్దతు ఇస్తాం" అని ఆయన తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి శాంతి చర్చలకు పిలుపునిచ్చారు.

బ్రిక్స్‌ను విభజన సంస్థగా కాకుండా, మొత్తం మానవాళి ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థగా మలచాలని ఆయన సూచించారు. యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి, వాతావరణ మార్పులు వంటి సవాళ్లపై మోదీ ఆందోళన వ్యక్తం చేసి, బ్రిక్స్ ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపించగలదని చెప్పారు.

ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు వద్దు
మోదీ ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతో, అంతర్జాతీయ సమాజం అంతా కలిసి కృషి చేయాలని అన్నారు. "ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కఠిన చర్యలు అవసరం" అని స్పష్టంచేశారు.

కొత్త దేశాల చేరిక
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మాట్లాడుతూ.. బ్రిక్స్ కూటమిలో చేరేందుకు అనేక గ్లోబల్ సౌత్ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కొత్తగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు సభ్యదేశాలుగా చేరనున్నాయి.

Modi-Xi Jinping Bilateral: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ ద్వైపాక్షిక భేటీ

భవిష్యత్ ప్రణాళికలు
జిన్‌పింగ్, "ఒక్క ఐదేళ్లలో 10 ఓవర్సీస్ లెర్నింగ్ సెంటర్లు ఏర్పాటుకు సిద్ధం" అని ప్రకటించారు. వీటిలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సదస్సు ద్వారా బ్రిక్స్ కూటమి ఉన్నత లక్ష్యాలను సాధించడానికి అవశ్యకమైన మార్గాలను బలోపేతం చేయాలని మోదీ మరియు జిన్‌పింగ్ నేతృత్వం వహించారు.

భారత ఆర్థిక ప్రగతి సూపర్ పుతిన్ 
భారత ఆర్థిక ప్రగతి అంశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు. బ్రిక్స్ సదస్సులో, భారత్ 7.5% వృద్ధి రేటును సాధించి ఆదర్శంగా నిలిచిందని ఆయన ప్రశంసించారు. "ప్రధాని మోదీ ఈ విజయాలను సాధించడంలో మహా కృషి చేశారు" అని పుతిన్ అన్నారు. భారత్, రష్యా ద్వైపాక్షిక వాణిజ్యంలో సాధించిన వృద్ధి పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

ఉగ్రవాదంతో అందరికీ ముప్పు
బ్రిక్స్ సదస్సు అనంతరం, కూటమి నేతలు ఒక ఉమ్మడి డిక్లరేషన్ విడుదల చేశారు, ఇందులో ఉగ్రవాదాన్ని 'ఉమ్మడి ముప్పు'గా పేర్కొన్నారు. "ఉగ్రవాదం ఏ ఒక్క మతం, జాతీయతకు సంబంధించి కాదు. అందరికి ముప్పు" అని పేర్కొని, నియంత్రణ చర్యలను బలోపేతం చేయాలని తీర్మానించారు.

Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి శాంతియుత పరిష్కారం.. పుతిన్‌తో మోదీ

వాతావరణ మార్పు.. వాతావరణ మార్పులను కూడా డిక్లరేషన్‌లో ప్రస్తావించారు. అజర్ బైజాన్లో జరిగే కాప్-29 సదస్సులో ఈ సమస్యలకు సంబంధించి పరిష్కార మార్గం కనిపించనుంది అని అభిప్రాయపడ్డారు.

Published date : 25 Oct 2024 10:09AM

Photo Stories