Asain Games 2023 Squash: స్క్వాష్ పురుషుల ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం
ఫైనల్లో భారత్ 2–1 తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై విజయం సాధించింది. లీగ్ దశలో పాక్ చేతిలో ఓడిన సౌరవ్ ఘోషాల్ బృందం అసలు సమయంలో సత్తా చాటింది. పోరు 1–1తో సమంగా నిలిచిన తర్వాత భారత్‌ను గెలిపించాల్సిన బాధ్యత యువ ఆటగాడు అభయ్ సింగ్‌పై పడింది. లీగ్ దశలో తనపై విజయం సాధించిన నూర్ జమాన్‌తో అభయ్ తలపడ్డాడు.
Asian Games 2023 badminton: పురుషుల బ్యాడ్మింటన్ జట్టుకు రజితం
హోరాహోరీగా సాగిన ఐదు గేమ్‌ల పోరులో చివరకు అభయ్ 11–7, 9–11, 8–11, 11–9, 12–10తో జమాన్‌ను ఓడించాడు. నాలుగో గేమ్‌లో ఒక దశలో జమాన్ 9–7లో ఆధిక్యం నిలవగా, ఐదో గేమ్‌లోనూ అతను 10–8తో విజయానికి చేరువయ్యాడు. కానీ అద్భుత పోరాటపటిమ కనబర్చిన అభయ్ రెండు సందర్భాల్లోనూ సత్తా చాటి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. చివరి పాయింట్ తర్వాత భారత జట్టు సభ్యులు భావోద్వేగంతో సంబరాలు చేసుకున్నారు.
అంతకు ముందు తొలి మ్యాచ్‌లో పాక్ ఆటగాడు ఇక్బాల్ నసీర్ 11–8, 11–2, 11–3తో మహేశ్ మంగావ్‌కర్‌పై ఘన విజయం సాధించాడు. అయితే ఆరోసారి ఆసియా క్రీడల బరిలోకి దిగిన భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ రెండో మ్యాచ్‌లో 11–5, 11–1, 11–3తో ముహమ్మద్ ఆసిమ్ ఖాన్‌ను చిత్తు చేసి స్కోరును సమం చేశాడు. 2014 ఇంచియాన్ ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గిన భారత్ 2018 పోటీల్లో కాంస్యంతో సరిపెట్టుకుంది.