Asain Games 2023 Archery: ఆర్చరీ కాంపౌండ్ మిక్స్‌డ్ విభాగంలో భారత్‌కు స్వర్ణం
ఫైనల్లో జ్యోతి సురేఖ–ఓజస్ ప్రవీణ్ జంట 159–158తో సోచేవన్–జేహూన్ జూ (దక్షిణ కొరియా) ద్వయం పై గెలిచింది. అంతకుముందు సురేఖ–ఓజస్ సెమీఫైనల్లో 159–154తో కజకిస్తాన్ జోడీపై, క్వార్టర్ ఫైనల్లో 158–155తో మలేసియా జంటపై విజయం సాధించింది.
Asian Games 2023 Javelin Throw: నీరజ్ చోప్రాకు స్వర్ణం
ఆసియా క్రీడల బాక్సింగ్‌లో భారత పోరాటం ముగిసింది. మహిళల 75 కేజీల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్ రజత పతకంతో సరిపెట్టుకుంది. లీ కియాన్ (చైనా)తో జరిగిన ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లవ్లీనా 0–5తో ఓడిపోయింది. మహిళల 57 కేజీల విభాగం సెమీఫైనల్లో పర్వీన్ హుడా 0–5తో లిన్ యు టింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయి కాంస్య పతకం సాధించింది. ఈ ఆసియా క్రీడల్లో భారత బాక్సర్లు ఒక రజతం, నాలుగు కాంస్యాలు గెలిచారు. 2018 ఆసియా క్రీడల్లో భారత బాక్సర్లు ఒక స్వర్ణం, ఒక కాంస్యం నెగ్గారు.
Asian Games 2023 Athletes: ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు జోరు
ఆసియా క్రీడల రెజ్లింగ్‌లో పురుషుల గ్రీకో రోమన్ శైలిలో 13 ఏళ్ల తర్వాత భారత్‌కు మళ్లీ పతకం లభించింది. 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించాడు. కాంస్య పతక బౌట్‌లో సునీల్ 2–1తో అతాబెక్ అజిస్‌బెకోవ్ (కిర్గిస్తాన్)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన జ్ఞానేందర్ (60 కేజీలు), నీరజ్ (67 కేజీలు), వికాస్ (77కేజీలు) తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు. చివరిసారి 2010 గ్వాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో భారత గ్రీకో రోమన్ రెజ్లర్లు రవీందర్ సింగ్ (60 కేజీలు), సునీల్ కుమార్ రాణా (66 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు.