Most Medals in Paralympics: భారత పారాలింపిక్స్ చరిత్రలో అత్యధిక పతకాలు
2020 టోక్యో కీడల్లో ఓవరాల్‌గా 19 పతకాలు గెలుచుకున్న మన బృందం ఇప్పుడు దానిని అధిగమించింది. సెప్టెంబర్ 4వ తేదీ పోటీలు ముగిసేసరికి భారత్ ఖాతాలో మొత్తం 22 పతకాలు చేరాయి.
➣ పురుషుల హైజంప్ ఈవెంట్‌లో శరద్ కుమార్ రజతం, మరియప్పన్ తంగవేలు కాంస్యం సాధించారు. ఈ పోటీలో ఎజ్రా ఫ్రెంచ్ (అమెరికా; 1.94 మీటర్లు) స్వర్ణ పతకం సాధించాడు.
➣ పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో అజీత్ సింగ్ రజతం, సుందర్ సింగ్ గుర్జర్ కాంస్యం గెలుచుకున్నారు. ఇందులో క్యూబాకు చెందిన గిలెర్మో గొంజాలెజ్ (66.14 మీటర్లు) స్వర్ణం గెలుచుకున్నాడు.
➣ పురుషుల ఆర్చరీ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో హర్విందర్ సింగ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో హర్విందర్ కాంస్య పతకాన్ని గెలిచాడు.
➣ పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 ఈవెంట్‌లో భారత ఆటగాడు సచిన్ ఖిలారి రజత పతకంతో మెరిశాడు. గత ఆసియా పారా క్రీడల్లో అతను స్వర్ణం సాధించాడు.
Paris Paralympics: శభాష్.. భారత్ ఖాతాలో చేరిన మరో గోల్డ్ మెడల్