Paralympics: పారాలింపిక్స్‌లో వరుసగా ఐదోసారి పసిడి పతకం సాధించిన రౌవా తిలీ
Sakshi Education
ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో ట్యునీషియాకు చెందిన రౌవా తిలీ షాట్‌పుట్ ఎఫ్41 విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.
వరుసగా ఐదో పారాలింపిక్స్‌లో ఆమె పసిడి పతకం గెలుచుకుంది. ఈ విజయంతో రౌవా తిలీ తన ఓవరాల్ ఒలింపిక్ స్వర్ణాల సంఖ్యను ఏడుకు చేర్చారు.
దీంతో పాటు మరో 2 రజతాలు కూడా ఆమె సాధించింది. 2008లో డిస్కస్ త్రోలో స్వర్ణం సాధించిన రౌవా, 2012లో షాట్‌పుట్‌లో బంగారు పతకాన్ని అందుకుంది. ఆ తర్వాత 2016, 2020లలో అటు షాట్‌పుట్‌లో, ఇటు డిస్కస్‌లో రెండేసి స్వర్ణాల చొప్పున నెగ్గింది. 34 ఏళ్ల రౌవా తిలీ ఎత్తు 4.4 అడుగులు మాత్రమే కావడం విశేషం.
Jannik Sinner: ఈ ఏడాది ఐదో టైటిల్ సొంతం టెన్నిస్ స్టార్ ఈయనే..
Published date : 02 Sep 2024 03:11PM