Asian Games 2023 badminton: పురుషుల బ్యాడ్మింటన్ జట్టుకు రజితం
Sakshi Education
ఆసియా క్రీడల్లో తొలిసారి పసిడి పతకం సాధించే అవకాశాన్ని భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు చేజార్చుకుంది.
ఫైనల్లో భారత్ 2–3తో చైనా చేతిలో ఓడి రజిత పతకంతో సరిపెట్టుకుంది . తొలి మ్యాచ్‌లో లక్ష్య సేన్ 22–20, 14–21, 21–18 తో షి యుకీపై గెలిచి భారత్‌కు 1–0 ఆధిక్యం ఇచ్చాడు. రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 21–15, 21–18తో లియాంగ్ వెకింగ్–చాంగ్ వాంగ్ జంటను ఓడించడంతో భారత్ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
Asian Games 2023: టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో గోల్డ్
మూడో మ్యాచ్‌లో శ్రీకాంత్ 22–24, 9–21తో లి షిఫెంగ్ చేతిలో ... నాలుగో మ్యాచ్‌లో ధ్రువ్–సాయిప్రతీక్ ద్వయం 6–21, 15–21 తో లియు యుచెన్–జువాన్‌యి ఒయు జోడీ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో గాయంతో ఫైనల్‌కు దూరమైన భారత నంబర్‌వన్ ప్రణయ్ స్థానంలో మిథున్ ఆడాల్సి వచ్చింది. మిథున్ 12–21, 4–21 తో హాంగ్యాంగ్ వెంగ్ చేతిలో ఓటమి చెందాడు.
Published date : 02 Oct 2023 01:37PM