చైనా గడ్డపై భారత్ తమ పతకాల వేటను దిగ్విజయంగా ముగించింది.
Asian Games 2023@107
ఆసియా క్రీడల్లో ఎవరూ ఊహించని విధంగా 107 పతకాలతో అదరగొట్టింది. ఇందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు ఉన్నాయి. తమ పోటీల చివరిరోజు భారత్ 12 పతకాలు గెలిచి పతకాల పట్టికలో నాలుగో స్థానాన్ని ఖరారు చేసుకుంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ 16 స్వర్ణాలు, 23 రజతాలు, 31 కాంస్యాలతో కలిపి 70 పతకాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది.