Asian Games 2023 Cricket: టీమిండియాకు స్వర్ణం
![Indian Men's Cricket Team 2023, Asian Games 2023 Cricket ,Gold Medal Moment for Indian Cricket Team](/sites/default/files/images/2023/10/09/indvsafg-1696821409.jpg)
టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత బౌలర్ల దాటికి అఫ్గన్ టాపార్డర్ కుదేలైంది. కేవలం 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది.
Asian Games 2023 Wrestling: రెజ్లింగ్‌లో కాంస్య పతకాలు
వర్షం కారణంగా మ్యాచ్ రద్దు
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో షహీదుల్లా కమల్ 43 బంతుల్లో 49 పరుగులతో, కెప్టెన్ గులాబదిన్ నయీబ్ 24 బంతుల్లో 27 పరుగులతో అజేయంగా నిలిచి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, వర్షం రాకతో సీన్ మారిపోయింది.
వరణుడి అంతరాయం కారణంగా 18.2 ఓవర్లలో అఫ్గనిస్తాన్ 5 వికెట్లు నష్టానికి 112 పరుగుల వద్ద ఉన్న వేళ మ్యాచ్ ఆగిపోయింది. ఆ తర్వాత వర్షం కురుస్తూనే ఉండటంతో మ్యాచ్ కొనసాగే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
Asian Games 2023 archery: ఆర్చరీ రికర్వ్‌లో రజతం
రుతురాజ్ సేనకు స్వర్ణం ఎలా అంటే?
ఈ నేపథ్యంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియాను స్వర్ణం వరించింది. ఇక భారత మహిళా క్రికెట్ జట్టు సైతం గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే.