Skip to main content

Asian Games 2023 archery: ఆర్చరీ రికర్వ్‌లో రజతం

ఆసియా క్రీడల ఆర్చరీ రికర్వ్‌ విభాగంలో భారత్‌ 13 ఏళ్ల పతక నిరీక్షణకు హాంగ్జౌలో తెరపడింది. చివరిసారి 2010 గ్వాంగ్‌జౌ ఏషియాడ్‌లో రికర్వ్‌ ఈవెంట్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు కాంస్య పతకాలు లభించాయి.
Asian Games 2023 archery
Asian Games 2023 archery

ఆ తర్వాతి రెండు ఆసియా క్రీడల్లో ఈ విభాగంలో భారత్‌కు నిరాశే ఎదురైంది. తాజా ఏషియాడ్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ బొమ్మదేవర ధీరజ్, అతాను దాస్, తుషార్‌లతో కూడిన జట్టు రికర్వ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌కు తొలిసారి రజత పతకం అందించింది. ఫైనల్లో భారత్‌ 1–5తో దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయింది. అంతకు ముందు భారత్‌ క్వార్టర్‌ ఫైనల్లో 5–4తో మంగోలియాపై, సెమీఫైనల్లో 5–3తో బంగ్లాదేశ్‌పై గెలిచి ఫైనల్‌ చేరింది.

మరోవైపు సిమ్రన్‌జిత్‌ కౌర్, అంకిత, భజన్‌ కౌర్‌లతో కూడిన భారత మహిళల రికర్వ్‌ జట్టు కాంస్యం గెలిచింది. కాంస్య పతక మ్యాచ్‌లో భారత్‌ 6–2తో వియత్నాంపై నెగ్గింది. అంతకుముందు క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 6–2తో జపాన్‌పై గెలిచి, సెమీఫైనల్లో 2–6తో దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయింది.  

Asian Games 2023 wrestling: రెజ్లింగ్‌లో అంతిమ్‌కు కాంస్యం

Published date : 07 Oct 2023 03:23PM

Photo Stories