Akula Sreeja: టీటీ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా ఆకుల శ్రీజ
Sakshi Education
జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి, మాజీ విజేత ఆకుల శ్రీజ రన్నరప్‌గా నిలిచింది.

జనవరి 26వ తేదీ ముగిసిన ఈ టోర్నీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తరఫున బరిలోకి దిగిన శ్రీజ మహిళల సింగిల్స్ ఫైనల్లో 12-10, 11-8, 11-13, 10-12, 8-11, 11-9, 9-11తో దియా చిటాలె (ఆర్‌బీఐ) చేతిలో ఓడిపోయింది.
26 ఏళ్ల శ్రీజ ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 28వ స్థానంలో ఉంది. భారత నంబర్‌వన్ ర్యాంకర్‌గా కొనసాగుతున్న శ్రీజ గత ఏడాది ఆసియా చాంపియన్‌షిప్ టీమ్ విభాగంలో భారత జట్టు కాంస్య పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించింది. పారిస్ ఒలింపిక్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది.
Published date : 28 Jan 2025 03:20PM