Asia Under 15: ఆసియా అండర్–15 బాలికల సింగిల్స్ విజేత తన్వీ పత్రి
చైనాలోని చెంగ్డూ నగరంలో జరిగిన ఈ టోర్నీలో ఒడిశాకు చెందిన 13 ఏళ్ల తన్వీ వరుస గేముల్లో గెలిచింది. టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగిన తన్వీ తుది పోరులో 22–20, 21–11తో రెండో సీడ్ థి థు హుయెన్ ఎన్గుయెన్ (వియత్నాం)పై విజయం సాధించింది.
టైటిల్ గెలిచిన క్రమంలో తన్వీ టోర్నీ మొత్తంలో తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోలేదు. ఈ గెలుపుతో ఆసియా అండర్–15 బాలికల సింగిల్స్ విభాగంలో టైటిల్ సాధించిన మూడో భారత క్రీడాకారిణిగా తన్వీ గుర్తింపు పొందింది.
2017లో హైదరాబాద్ అమ్మాయి సామియా ఇమాద్ ఫారూఖీ, 2019లో గుజరాత్ అమ్మాయి తస్నీమ్ మీర్ ఈ ఘనత సాధించారు. ఇదే టోర్నీలో బాలుర అండర్–17 సింగిల్స్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ ప్లేయర్ జ్ఞాన దత్తు సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాన్ని సాధించాడు.
Shikhar Dhawan: సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్