Skip to main content

BCCI: దేశవాళీ క్రికెట్‌లో ప్రోత్సాహకాలు.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’కు ప్రైజ్‌మనీ

దేశవాళీ క్రికెట్‌లో ఆటగాళ్ల ప్రదర్శనకు మరింత ప్రోత్సాహం అందించేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త నిర్ణయాన్ని తీసుకుంది.
BCCI Introduces Prize Money For Top Players In Domestic Cricket

ఇకపై విజయ్‌ హజారే వన్డే టోర్నీ, ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచే ఆటగాళ్లకు ప్రైజ్‌మనీ కూడా ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ రెండు టోర్నీలలో నాకౌట్‌ మ్యాచ్‌లలో మాత్రమే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ను ప్రకటించేవారు. 
 
వీరికి కూడా మొమెంటో ఇస్తుండగా ప్రైజ్‌మనీ మాత్రం లేదు. లీగ్‌ దశ మ్యాచ్‌లలోనైతే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ను ప్రకటించే సంప్రదాయం లేదు. ఇకపై దీనిలో మార్పు రానుంది. మరోవైపు మహిళల క్రికెట్‌కు సంబంధించిన అన్ని టోర్నీల్లోనూ, జూనియర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లకు కూడా తాజా ‘ప్రైజ్‌మనీ’ నిర్ణయం వర్తిస్తుందని షా వెల్లడించారు.

BCCI Records: బీసీసీఐ జీఎస్టీ చెల్లింపులు రూ.2038 కోట్లు

Published date : 28 Aug 2024 09:21AM

Photo Stories