Wriddhiman Saha: రిటైర్‌మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ క్రికెటర్
ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్ తర్వాత తను క్రికెట్ నుంచి వైదొలగనున్నట్లు సాహా సోషల్ మీడియాలో వెల్లడించాడు. 40 ఏళ్ల సాహా వయసు రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ బెంగాల్ స్టార్ ప్లేయర్ గత మూడేళ్లగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నప్పటకి.. ఐపీఎల్, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మాత్రం భాగమవుతూ వస్తున్నాడు. ఐపీఎల్‌లో గత కొన్నేళ్లగా గుజరాత్ టైటాన్స్‌కు వృద్ధిమాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
అయితే వచ్చే ఏడాది సీజన్‌కు ముందు అతడిని గుజరాత్ విడిచిపెట్టింది. ఈ క్రమంలో అతడు ఐపీఎల్-2025 మెగా వేలంలో తన పేరును కూడా సాహా నమోదు చేసుకోపోయినట్లు తెలుస్తోంది. సాహా తన చివరి టెస్టు 2021లో న్యూజిలాండ్‌పై ఆడాడు.
Rani Rampal: రిటైర్మెంట్ ప్రకటించిన 'భారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్'
ధోని తర్వాత..
అయితే టెస్టు క్రికెట్‌లో భారత్ చూసిన అత్యుత్తమ వికెట్ కీపర్లలో సహా ఒకడని చెప్పుకోవచ్చు. అతడికి అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్ ఉన్నాయి. ధోని రిటైర్మెంట్ తర్వాత సాహా భారత టెస్టు జట్టులో రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా కొనసాగాడు. వృద్ధిమాన్ సాహా భారత్ తరపున 40 టెస్టులు ఆడి 1353 పరుగులు చేశాడు.
అతడి టెస్టు కెరీర్‌లో మూడు సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా.. 9 వన్డేలు ఆడి 41 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై, కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లకు ప్రాతినిధ్యం వహించచిన సాహా మొత్తంగా 170 మ్యాచ్‌లు ఆడాడు.