Skip to main content

Dawid Malan: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విధ్వంసకర బ్యాట్స్‌మన్

ఇంగ్లండ్‌ క్రికెట్ జట్టుకు ఓ అద్భుతమైన ఆటగాడు దూరమయ్యాడు.
England Cricketer Dawid Malan Retires from International Cricket

ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ మలన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.  2017లో ఇంగ్లండ్‌ తరఫున అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌.. తన కెరీర్‌లో 22 టెస్టులు, 30 వన్డేలు, 62 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1074, 1450, 1892 పరుగులు సాధించాడు.
 
టెస్టుల్లో ఒకటి, వన్డేల్లో ఆరు, టీ20లలో ఒక సెంచరీ సాయంతో ఈ మేర డేవిడ్‌ మలన్‌ పరుగులు స్కోరు చేశాడు. ఇక ఇంటర్నేషనల్‌ కెరీర్‌లో మూడు ఫార్మాట్లలోనూ శతకాలు బాదిన మలన్‌.. ఈ ఘనత సాధించిన రెండో ఇంగ్లిష్‌ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు జోస్‌ బట్లర్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

Women Under 19 World Cup Schedule : మహిళల అండర్‌–19 టీ20 ప్రపంచ కప్‌ షెడ్యూల్‌ విడుదల

➣ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించి, తన ప్రతిభను ప్రదర్శించాడు.
➣ టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేవలం 24 ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.  

➣ తన అద్భుతమైన ఫామ్‌తో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.
➣ టెస్టు, వన్డే, టీ20 అనే మూడు ఫార్మాట్లలోనూ శతకాలు సాధించిన ఇంగ్లండ్‌కు చెందిన కొద్దిమంది ఆటగాళ్లలో మలన్ ఒకడు.
➣ ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు.

రిటైర్మెంట్‌కు కారణాలు ఇవే..
ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు. ఇంగ్లండ్ జట్టులో యువ ఆటగాళ్లు ఎదిగి వస్తుండటం వల్ల పోటీ పెరిగింది. 37 ఏళ్ల వయసులో క్రికెట్ కెరీర్‌కు విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

Shikhar Dhawan: సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్

Published date : 30 Aug 2024 08:45AM

Photo Stories