Poland Student Visa New Rules: వీసా నిబంధనలు కఠినతరం.. ఇకపై ఆ సర్టిఫికేట్ లేకుండా వెళ్లలేరు
ఈరోజుల్లో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడం సాధారణం అయిపోయింది. ఈ నేపథ్యంలో వలసలను అరికట్టేందుకు వీసా నిబంధనల్లో పలు దేశాలు కఠన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
Fake Universities: ఆ యూనివర్సిటీలు నకిలీవని తేల్చిన యూజీసీ.. వాటిలో డిగ్రీలు చెల్లవు
తాజాగా పోలాండ్‌లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వచ్చే విదేశీ విద్యార్థులకు జారీ చేసే స్టూడెంట్ వీసాల నియమాలను కఠినతరం చేసింది. ఈ ఏడాది మే నెలలో వెలుగులోకి వచ్చిన స్టూడెంట్ వీసా కుంభకోణంతో పోలాండ్ తాజాగా ఈ మార్పులు చేసింది.
ఉద్యోగ అవకాశాల కోసం అక్కడికి వస్తున్న చాలామంది స్టూడెంట్ వీసాలను దుర్వినియోగం చేస్తున్నారని బయటపడటంతో పోలాండ్ వీసా నిబంధనల్లో మార్పులు చేసింది.
TG ICET Counselling 2024: తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
దీని ప్రకారం.. హైస్కూల్ సర్టిఫికేట్ లేకుండా వీసా అప్లై చేయడానికి వీలు ఉండదు. అంతేకాకుండా స్టూడెంట్ వీసా కింద కేవలం ఒక ఏడాది మాత్రమే పోలాండ్‌లో పనిచేసే అవకాశం ఉంటుంది అని పోలాండ్ విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్స్కి తెలిపారు.