Skip to main content

Fake Universities: ఆ యూనివర్సిటీలు నకిలీవని తేల్చిన యూజీసీ.. వాటిలో డిగ్రీలు చెల్లవు

Fake Universities List of Fake Universities in India by UGC

దేశంలో 21 నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) గుర్తించింది. వీటిలో అత్యధికంగా ఢిల్లీలో 8 ఫేక్‌ వర్సిటీలు ఉండగా, ఏపీలో రెండు యూనివర్సిటీలు ఉ‍న్నట్లు తెలిపింది. గతేడాది 20 నకిలీ యూనివర్సిటీలు ఉండగా, ఈ ఏడాది వాటి సంఖ్య 21కి చేరింది. ఈ యూనివర్సిటీలు జారీ చేసే డిగ్రీలు చెల్లుబాటు కావని పేర్కొంది.

TG ICET Counselling 2024: తెలంగాణ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

అంతేకాకుండా ఈ ఫేక్ వర్సిటీలు డిగ్రీలు ప్రదానం చేసినా వాటిని ఉ‍ద్యోగ ప్రయోజనాల కోసం గుర్తించబోమని మరోసారి స్పష్టం చేసింది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న నకిలీ యూనివర్సిటీల్లో అత్యధికంగా 8 ఢిల్లీలోనే ఉన్నట్లు గుర్తించింది. ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే.. గుంటూరులోని క్రైస్ట్ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, విశాఖపట్నం ఆంధ్ర ప్రదేశ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా.. ఈ రెండు యూనివర్సటీలను నకీలీలుగా తేల్చింది. 

ఢిల్లీలోని 8 నకిలీ వర్సిటీలు
ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం, ఢిల్లీ కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్ దర్యాగంజ్, ఢిల్లీ ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం, ఢిల్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఢిల్లీ ఒకేషనల్ యూనివర్సిటీ, ఢిల్లీ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, ఢిల్లీ ఏడిఆర్ సెంట్రిక్ జ్యురిడికల్ యూనివర్సిటీలు ఫేక్ యూనివర్సిటీలని తేల్చింది.

Impact Of Mobile Phones On Children: చిన్నారులకు స్మార్ట్‌ఫోన్లు ఇస్తున్నారా? మెదడుపై విపరీతంగా ప్రభావం..

 

నకిలీ యూనివర్సిటీలు ఇవే..

ఢిల్లీ: 

  1. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అండ్‌ఫిజికల్ హెల్త్‌ సైన్సెస్‌
  2. కమర్షియల్‌ యూనివర్సిటీ లిమిటెడ్‌-దర్యాగంజ్‌
  3. యూనైటెడ్ నేషన్స్ విశ్వవిద్యాలయం
  4. వొకేషనల్‌ యూనివర్సిటీబీ
  5. ఏడీఆర్‌ సెంట్రిక్‌ జ్యూరిడికల్‌ యూనివర్సిటీ
  6. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ సైన్సెస్‌ అండ్‌ ఇంజినీరింగ్‌
  7. విశ్వకర్మ ఓపెన్‌ యూనివర్సిటీ ఫర్‌ సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌
  8. ఆధ్యాత్మిక్‌ విశ్వవిద్యాలయ (ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం)

ఉత్తరప్రదేశ్‌

  • గాంధీ హిందీ విద్యాపీఠ్‌, ప్రయాగ్‌రాజ్‌
  • నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ యూనివర్సిటీ (ఓపెన్‌ యూనివర్సిటీ)
  • భారతీయ శిక్షా పరిషత్‌ 
  • మహామయ టెక్నికల్‌ యూనివర్సిటీ

పశ్చిమబెంగాల్    

  1. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, కోల్‌కతా
  2. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌ అండ్‌ రీసెర్చి, ఠాకూర్పుకూర్

ఆంధ్రప్రదేశ్    

  • క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, గుంటూరు
  • బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా, విశాఖపట్నం

కర్ణాటక: బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్శిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, బెల్గాం
కేరళ     :సెయింట్ జాన్స్ యూనివర్సిటీ
మహారాష్ట్ర: రాజా అరబిక్ యూనివర్సిటీ
పుదుచ్ఛేరి: శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్
 

 

Published date : 26 Aug 2024 03:47PM

Photo Stories