Skip to main content

Madison Keys: తొమ్మిదేళ్ల తర్వాత.. మాడిసన్ కీస్‌‌‌‌‌‌‌‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్‌‌‌‌‌‌‌‌

ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ రూపంలో కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన అమెరికా క్రీడాకారిణి మాడిసన్‌ కీస్‌.. తొమ్మిదేళ్ల విరామం తర్వాత మళ్లీ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను అందుకుంది.
Madison Keys rises from No.14 to No.7 on WTA rankings

జ‌న‌వ‌రి 27వ తేదీ విడుదల చేసిన మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) తాజా ర్యాంకింగ్స్‌లో 29 ఏళ్ల కీస్‌ 14వ ర్యాంక్‌ నుంచి ఏడు స్థానాలు ఎగబాకి 7వ ర్యాంక్‌కు చేరుకుంది. 

కీస్‌ ఖాతాలో 4680 పాయింట్లున్నాయి. 2016 అక్టోబర్‌ 10న కీస్‌ కెరీస్‌ బెస్ట్‌ ఏడో ర్యాంక్‌లో నిలిచింది. ఆ తర్వాత 2020 వరకు కీస్‌ టాప్‌–20లో కొనసాగింది. 2021 సీజన్‌ ముగిసేసరికి 56వ ర్యాంక్‌కు చేరిన కీస్‌ 2022 సీజన్‌ను 11వ ర్యాంక్‌తో... 2023 సీజన్‌ను 12వ ర్యాంక్‌తో, 2024 సీజన్‌ను 21వ ర్యాంక్‌తో ముగించింది. 

డబ్ల్యూటీఏ తాజా ర్యాంకింగ్స్‌లో టాప్‌–10లో నలుగురు అమెరికా క్రీడాకారిణులు ఉన్నారు. కోకో గాఫ్‌ 6538 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో.. జెస్సికా పెగూలా 4861 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో.. ఎమ్మా నవారో 3709 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు.

Australian Open 2025: ఒలివియా–జాన్‌ పీర్స్‌ జోడీకి మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్

Published date : 29 Jan 2025 08:59AM

Photo Stories