Jasprit Bumrah: ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా బుమ్రా.. తొలి భారత పేసర్‌గా రికార్డు

31 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలింగ్ సంచలనం, ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డుకు (సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ) ఎంపికయ్యాడు. గతేడాది ఫార్మాట్లకతీతంగా రాణించినందుకు గానూ బుమ్రాను ఈ అవార్డు వరించింది.
భారత పేసర్‌గా రికార్డు
ఈ అవార్డు గెలుచుకున్న తొలి భారత పేసర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా ఈ అవార్డు గెలుచుకున్న ఐదో భారత క్రికెటర్ బుమ్రా. బుమ్రాకు ముందు రాహుల్ ద్రవిడ్ (2004), సచిన్ టెండూల్కర్ (2010), రవిచంద్రన్ అశ్విన్ (2016), విరాట్ కోహ్లి (2017, 2018) ఈ అవార్డులు గెలుచుకున్నారు. సర్ గ్యారిఫీల్డ్ సోబర్స్ పేరిట ఇచ్చే ఈ అవార్డు కోసం ట్రవిస్ హెడ్, జో రూట్, హ్యారీ బ్రూక్ బుమ్రాతో పోటీపడ్డారు.
ఈ అవార్డు గెలవడానికి ముందు బుమ్రా ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు-2024 కూడా గెలుచుకున్నాడు. బుమ్రా గతేడాది టెస్ట్‌ల్లో విశేషంగా రాణించాడు (13 మ్యాచ్‌ల్లో 71 వికెట్లు).
ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్న బుమ్రా.. భారత్ తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్స్ సాధించిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. బుమ్రా గతేడాది 907 రేటింగ్ పాయింట్స్‌ను సాధించాడు.
ICC Rankings: ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో.. బూమ్రా నంబర్‌వన్
2024 ఐసీసీ అవార్డులు..
- ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ)-జస్ప్రీత్ బుమ్రా
- ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (రేచల్ హెహోయ్ ఫ్లింట్ ట్రోఫీ)-మేలీ కెర్
- ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-జస్ప్రీత్ బుమ్రా
- ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-స్మృతి మంధన
- ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- అజ్మతుల్లా ఒమర్‌జాయ్
- ఐసీసీ ఎమర్జింగ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అన్నెరీ డెర్క్‌సెన్
- ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-కమిందు మెండిస్
- ఐసీసీ వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-ఈషా ఓఝా
- ఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-గెర్హార్డ్ ఎరాస్మస్
- ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్-రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్
- ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అర్షదీప్ సింగ్
- ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-మేలీ కెర్
Arshdeep Singh: ‘టి20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికైన అర్ష్‌దీప్