Skip to main content

PM Morawiecki loses vote of confidence: అవిశ్వాస పరీక్షలో ఓడిన పోలండ్‌ ప్రధాని

పోలండ్ పార్లమెంటులో జరిగిన అవిశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో పోలండ్‌ ప్రధాన మంత్రి మాథ్యూస్‌ మొరావెస్కీ ప్రభుత్వం కుప్పకూలింది.
PM Morawiecki loses vote of confidence in parliament
PM Morawiecki loses vote of confidence in parliament

అవిశ్వాస పరీక్ష ఓట‌మితో నేషనల్‌ కన్జర్వేటివ్‌ పార్టీ ఎనిమిదేళ్ల పాలన ముగిసిపోయింది. పోలండ్‌ దిగువసభలో మొత్తం 460 మంది సభ్యులుండగా మొరావిస్కీ ప్రభుత్వానికి అనుకూలంగా 190 ఓట్లు, వ్యతిరేకంగా 266 ఓట్లు వచ్చాయి. దీంతో మొరావెస్కీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోక తప్పలేదు. ఐరోపా యూనియన్‌ మాజీ నేత డొనాల్డ్‌ టస్క్‌ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. టస్క్‌ 2007-2014 మధ్య కాలంలోనూ పోలండ్‌ ప్రధాని మంత్రిగా ఉన్నారు.

Russia Presidential Elections: మార్చిలో రష్యా అధ్యక్ష ఎన్నికలు

Published date : 13 Dec 2023 09:35AM

Photo Stories