Skip to main content

Gas Supply: ఏ దేశాలకు గ్యాస్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు రష్యా ప్రకటించింది?

Gas Supply

నాటో సభ్యదేశాలైన పోలాండ్, బల్గేరియాకు సహజవాయు సరఫరా నిలిపివేస్తున్నట్లు రష్యా ఏప్రిల్‌ 27న ప్రకటించింది. త్వరలో ఇతర దేశాలకు కూడా సరఫరా ఆపేస్తామని హెచ్చరించింది. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందిస్తామని యూఎస్, యూరప్‌ దేశాలు నిర్ణయించిన మర్నాడే రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. రష్యా ప్రకటనతో యూరప్‌లో గ్యాస్‌ ధరలు భగ్గుమన్నాయి. మరోవైపు ఈ చర్య రష్యా ఆదాయంపై ప్రభావం చూపుతుందని, దీనివల్ల యుద్ధానికి నిధులు సమకూర్చడంలో ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారు.

Russia-Ukraine War: ఉక్రెయిన్‌కు జెపార్డ్‌ గన్స్‌ పంపుతామని ప్రకటించిన దేశం?

ఉక్రెయిన్‌కు పాశ్చాత్యదేశాలు పోలాండ్‌ ద్వారానే ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి. బల్గేరియాలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రష్యాతో సంబంధాలను తెంచుకుంది. పైగా బల్గేరియా తీరప్రాంతంలోని నాటో అవుట్‌పోస్టులో పలు జెట్‌ విమానాలు మోహరించారు. వీటిని దృష్టిలో ఉంచుకొని రష్యా గ్యాస్‌ సరఫరా నిలిపివేసింది. రష్యా రూబుల్స్‌లో చెల్లింపులకు అంగీకరించనందుకే ఈ చర్య తీసుకున్నట్లు రష్యా చమురు సంస్థ గాజ్‌ప్రామ్‌ ప్రకటించింది. మరోవైపు ‘‘సర్మాత్‌ 2’’ అణు క్షిపణిని రష్యా విజయవంతంగా ప్రయోగించింది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలను ఈ క్షిపణి కవర్‌ చేస్తుందని రష్యా తెలిపింది.Nuclear Weapons: ప్రపంచంలో అత్యధిక అణు వార్‌హెడ్లు కలిగిన దేశం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
నాటో సభ్యదేశాలైన పోలాండ్, బల్గేరియాకు సహజవాయు సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటన
ఎప్పుడు : ఏప్రిల్‌ 27
ఎవరు    : రష్యా 
ఎందుకు : రష్యా రూబుల్స్‌లో చెల్లింపులకు అంగీకరించనందుకే..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 28 Apr 2022 11:59AM

Photo Stories