Skip to main content

Russia-Ukraine War: ఉక్రెయిన్‌కు జెపార్డ్‌ గన్స్‌ పంపుతామని ప్రకటించిన దేశం?

Gepard anti-aircraft guns

ఉక్రెయిన్‌తో సంఘర్షణ మూడో ప్రపంచ యుద్ధంగా పరిణమించే ప్రమాదం పొంచి ఉందని రష్యా అభిప్రాయపడింది. ఉక్రెయినే తన తీరుతో ఆ దిశగా రెచ్చగొడుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో అణు యుద్ధ ముప్పును అస్సలు కొట్టిపారేయలేమని ఏప్రిల్‌ 26న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ ఘాటు హెచ్చరికలు చేశారు.

Nuclear Weapons: ప్రపంచంలో అత్యధిక అణు వార్‌హెడ్లు కలిగిన దేశం?

40 దేశాల మంత్రుల భేటీ
ఉక్రెయిన్‌కు కావాల్సినంత సైనిక సాయం అందిస్తామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ స్పష్టం చేశారు. 40 దేశాలరక్షణ మంత్రులు, అధికారులతో జర్మనీలో ఆయన సమాలోచనలు జరిపారు. ఉక్రెయిన్‌కు 500 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు పంపేందుకు అంగీకారం కుదిరిందని చెప్పారు. అత్యాధునిక జెపార్డ్‌ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ గన్స్‌ పంపుతామని జర్మనీ ప్రకటించింది.

శాంతియుత పరిష్కారమే కోరుతున్నాం: గుటెరస్‌తో పుతిన్‌
సంక్షోభానికి శాంతియుత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చెప్పారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌తో ఆయన రష్యా రాజధాని మాస్కోలో భేటీ అయ్యారు. ఇప్పటికైనా క్రిమియాపై రష్యా సార్వభౌమత్వాన్ని డోన్బాస్‌కు స్వాతంత్య్రాన్ని ఉక్రెయిన్‌ గుర్తించాలని పుతిన్‌ పేర్కొన్నారు. గుటెరస్‌ అంతకుముందు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో కూడా భేటీ అయ్యారు. యుద్ధాన్ని తక్షణం విరమించాలని సూచించారు.

ఉక్రెయిన్‌లో అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రులు
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్‌ అస్టిన్‌ ఏప్రిల్‌ 24న ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమై సంఘీభావం ప్రకటించారు. రష్యాతో యుద్ధంలో విజయం సాధించాలన్న ఉక్రెయిన్‌ లక్ష్యసాధనకు పూర్తిగా సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఫారిన్‌ మిలిటరీ ఫైనాన్సింగ్‌ కింద ఉక్రెయిన్‌కు మరో 32.2 కోట్ల డాలర్లు అందజేస్తామని తెలిపారు. 16.5 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు విక్రయిస్తామని వెల్లడించారు.

రెజినా డైలాగ్‌ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చిన నగరం?
రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంలో తటస్థ వైఖరిని అవలంబిస్తున్నందుకు భారత్‌ను విమర్శిస్తున్న వారిపై విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఎదురు దాడికి దిగారు. ఆసియాకు ఎదురవుతున్న సవాళ్లను పశ్చిమ దేశాలు ఇప్పటిదాకా పట్టించుకోలేదని భారత రాజధాని నగరం న్యూఢిల్లీ వేదికగా జరిగిన ‘రైజినా డైలాగ్‌–2022’ కార్యక్రమంలో ఆయన విమర్శించారు. నార్వే, లక్జెమ్‌బర్గ్‌ విదేశాంగ మంత్రులు, స్వీడన్‌ మాజీ ప్రధాని ప్రశ్నలకు ఈ మేరకు సమాధానమిచ్చారు.​​​​​​​​​​​​​​​​​​​​​GK Science & Technology Quiz: RBI గవర్నర్ శక్తికాంత దాస్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్‌ను ఎక్కడ ప్రారంభించారు?​​​​​​​

డౌన్‌లోడ్‌ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 27 Apr 2022 06:23PM

Photo Stories