Skip to main content

Satyendra Das: అయోధ్య రామాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ కన్నుమూత

అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆల‌య ప్రధాన పూజారి, అయోధ్య ధామ్ ఆచార్య సత్యేంద్ర కుమార్ దాస్ మహారాజ్ ఫిబ్రవరి 12వ తేదీ అనారోగ్యంతో కన్నుమూశారు.
Ayodhya Ram temple head priest Mahant Satyendra Das Passed Away

87 సంవత్సరాల మహంత్ సత్యేంద్ర దాస్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా లక్నోలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

సత్యేంద్ర దాస్ 1945 మే 20న ఉత్తరప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో జన్మించారు. గురువు అభిరామ్ దాస్ ప్రభావంతో 1958లో 13 సంవత్సరాల వయస్సులో సన్యాసం స్వీకరించారు.

1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో రామాలయ పూజారిగా పనిచేసిన సత్యేంద్ర దాస్ భారతదేశ రాజకీయ దృక్పథాన్ని మార్చే క్రమంలో కీలక పాత్ర వహించారు. ఆయన 20 సంవత్సరాల వయస్సులో ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుని, ఆ తరువాత యునివర్షల్ మోహన ఆశ్రమలో నివసించేందుకు వెళ్లారు.

సత్యేంద్ర దాస్ 34 సంవత్సరాల పాటు శ్రీ రామ జన్మభూమి పూజారిగా పనిచేశారు. ఆయనను నిర్వాణి అఖాడాకు చెందిన సభ్యుడిగా, అయోధ్యలో ఉన్న సాధువులలో ఒకరిగా గుర్తించబడింది. రామమందిరం సంబంధిత అన్ని పరిణామాలపై మీడియాతో ఆయన తక్కువ నిస్సంకోచంగా మాట్లాడేవారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత కూడా రామాలయంలో కీలక పాత్రను వహించి, రామలల్లా విగ్రహానికి తాత్కాలిక ప్రతిష్ట సమయంలో కూడా పూజలు నిర్వహించారు.

Aga Khan: ముస్లింల ఆధ్యాత్మిక గురువు.. ఆగాఖాన్ కన్నుమూత‌

Published date : 13 Feb 2025 09:54AM

Photo Stories