Kamalakar Babu: 'నెడ్‌క్యాప్' వీసీఎండీగా కమలాకర్ బాబు

ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ పవర్ కో-ఆర్డినేషన్ కమిటీ (ఏపీపీసీసీ)కి వోఎస్టీగాను, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఎండీ (ఎఫ్ఎసీ)గానూ ఉన్నారు. గత నెల 21నే ఆయనను ఏపీపీసీసీ వోఎస్టీగా నియమించగా, మూడు వారాలకే ఆ ఉత్తర్వులను రద్దు చేశారు.
ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఫిబ్రవరి 12వ తేదీ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. కమలాకర్బాబు గతంలోనూ టీడీపీ హయాంలోనే నెడ్‌క్యాప్‌కు వీసీఎండీగా పనిచేశారు.
తాజాగా రూ.లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను నడిపించే నెడ్‌క్యాప్ బాధ్యతలను ప్రభుత్వం కమలాకరా బాబుకు అప్పగించింది. పీఎం సూర్యఘర్, కుసుమ్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు చార్జింగ్ స్టేషన్లు, సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులతో పాటు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు సైతం నెడ్ క్యాప్ పరిధిలోనే ఉంటాయి. వీటన్నిటినీ పర్యవేక్షించే కీలక పదవిని వైద్య విభాగానికి చెందిన కమలాకర్ బాబుకు అప్పగించడం ఇంధన శాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
TG High Court: తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు శాశ్వత న్యాయమూర్తులు వీరే..