PM Modi : మోదీకి రష్యా అత్యున్నత పురస్కారం
Sakshi Education
రష్యా పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విశిష్ట గౌరవం దక్కింది. ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ సెంయిట్ ఆండ్రూ ది అపోస్టల్’ను ప్రకటించింది. ఈ అవార్డును ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జూలై 9న ప్రధాని మోదీకి ప్రదానం చేశారు. రష్యా–భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల విస్తరణతో పాటు బలోపేతానికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా అత్యున్నత పురస్కారంతో గౌరవించినట్లు తెలిపారు.
Miss AI Beauty : మిస్ ఏఐగా మొరాకో సుందరి కెంజాలేలి
ఇటీవల జులై 8, 9 తేదీల్లో రెండురోజుల పాటు 22వ భారత్ –రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు మోదీ రష్యాలో పర్యటించారు. అక్కడి నుంచి ఆయన ఆస్ట్రియాకు వెళ్లారు. 1983లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత.. అంటే దాదాపు 41ఏళ్లకు భారత ప్రధాని ఆస్ట్రియా దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి.
Published date : 17 Jul 2024 09:06AM
Tags
- India PM Modi
- Russia
- Distinguished honor
- highest award of russia
- The Order of Saint Andrew the Apostle
- July 9
- India and Russia
- russia president vladimir putin
- respect for modi
- Current Affairs Persons
- latest current affairs in telugu
- Education News
- Sakshi Education News
- Narendra Modi Russia award
- Vladimir Putin Prime Minister Modi award
- Order of Saint Andrew India relations
- Highest civilian award bilateral cooperation
- India-Russia diplomatic ties
- interntional news
- SakshiEducationUpdates