China-Taiwan Tensions: 25 ఏళ్ల తర్వాత తొలిసారి స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో
మలేషియా నుంచి విమానంలో తైవాన్ రాజధాని తైపీకి చేరుకున్నారు. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని, తమ మాట వినకుండా అక్కడ పర్యటిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ డ్రాగన్ దేశం చైనా చేసిన హెచ్చరికలను ఆమె ఏమాత్రం లెక్కచేయలేదు. అమెరికాకు తైవాన్ సన్నిహిత మిత్రదేశంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 25 ఏళ్ల తర్వాత తైవాన్‌ను సందర్శిస్తున్న అత్యున్నత అమెరికా ప్రతినిధి నాన్సీ పెలోసీ కావడం గమనార్హం. తైవాన్‌కు చేరుకున్నాక ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. తైవాన్‌లో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని అమెరికా ఆకాంక్షిస్తోందని, అందుకు తగిన సాయాన్ని కొనసాగిస్తుండడాన్ని గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
also read: Indian Polity Bit Bank For All Competitive Exams:దేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి?
పెలోసీ తైవాన్ పర్యటన నేపథ్యంలో అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లే అవకాశం కనిపిస్తోంది. తైవాన్‌లో పెలోసీ పర్యటన ప్రారంభం కాగానే చైనా అధికారిక జిన్‌హువా వార్తా సంస్థ స్పందించింది. తైవాన్ పరిసర సముద్ర జలాల్లో తమ(చైనా) సైన్యం ఆదివారం వరకు లైవ్–ఫైర్ డ్రిల్స్ చేపట్టనున్నట్లు ప్రకటించింది. అమెరికాకు హెచ్చరికగా సైనిక విన్యాసాలకు చైనా శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. చైనా సైన్యం తైవాన్ వైపు 21 విమానాలను పంపించింది.
Also read: 5G Spectrum : రూ. 1.5 లక్షల కోట్ల బిడ్లు
నిప్పుతో చెలగాటం: చైనా
అమెరికా వైఖరిపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అసహనం వ్యక్తం చేశారు. అమెరికా ప్రభుత్వం విశ్వసనీయతను కోల్పోతోందని అన్నారు. తైవాన్ విషయంలో కొందరు అమెరికా రాజకీయవేత్తలు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. అమెరికా వైఖరి ఏమాత్రం సమంజసంగా లేదన్నారు. పెలోసీ పర్యటన ప్రభావం చైనా–అమెరికా సంబంధాలపై కచి్చతంగా ఉంటుందని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పెలోసీ పర్యటన కంటే ముందు హ్యాకర్లు తైవాన్ అధ్యక్షుడి కార్యాలయం వెబ్‌సైట్‌పై సైబర్‌దాడికి దిగారు. దాంతో కొద్దిసేపు వెబ్‌సైట్ పనిచేయలేదు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP