Skip to main content

Civils Ranker Success Story: ఫెయిల్ అయ్యా.. కానీ నా పోరాటాన్ని మాత్రం ఆప‌లేదు.. అందుకే స‌క్సెస్ అయ్యా..

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్- 2021 సివిల్స్ ఫ‌లితాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నంద్యాల జిల్లా కోవెలకుంట్లకు చెందిన రైతు బిడ్డ గడ్డం సుధీర్‌కుమార్‌ సత్తా చాటారు.
Gaddam sudheer kumar reddy success story
Gaddam sudheer kumar reddy success story

నాలుగో ప్రయత్నంలో సివిల్స్‌లో 69వ ర్యాంక్ సాధించిన‌ గడ్డం సుధీర్‌కుమార్ రెడ్డి స‌క్సెస్ స్టోరీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం : 
తండ్రి గడ్డం రామసుబ్బారెడ్డి , త‌ల్లి రమాదేవి. వీరిది మొదటి నుంచి వ్యవసాయ కుటుంబం. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గ‌త 25 సంవత్సరాల క్రితం నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో స్థిరపడ్డారు.

Civil Ranker Story: ఫెయిల్యూర్ వ‌చ్చిన‌ప్పుడు చాలా తేలిగ్గా తీసుకున్నా.. నాలుగు సార్లు ఫెయిల్ అయ్యా.. కానీ..

ఎడ్యుకేష‌న్ : 

UPSC 2021 Topper


సుధీర్‌కుమార్‌ విద్యాభ్యాసం కోవెలకుంట్ల నుంచి మొదలైంది.  1వ త‌ర‌గ‌తి నుంచి 4వ తరగతి వరకు కోయిలకుంట్ల సత్యసాయి విద్యాలయంలో చ‌దివారు. 5వ తరగతి మాత్రం నంద్యాల పట్టణంలోని గుడ్ షెఫర్డ్ స్కూల్‌లో కొనసాగింది. 6,7 తరగతులు కర్నూలు మాంటిస్సోరిలో చ‌దివారు. 8, 9, 10 తరగతులు మాత్రం గుడివాడలోని కేఆర్ఆర్‌ గౌతమ్ స్కూల్‌లో చదివారు.ఇంటర్మిడియ‌ట్‌ను విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో పూర్తి చేశారు. ఖరగ్ పూర్ ఐఐటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.

UPSC Civils Topper Shruti Sharma : సివిల్స్ టాప‌ర్ శృతి శర్మ.. స‌క్సెస్ సిక్రెట్‌ ఇదే..

Sumit Sunil IPS: డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేస్తూనే.. ఐపీఎస్‌ అయ్యానిలా..

సివిల్స్ రాసిన మూడు సార్లు..

UPSC Civils Ranker gaddam sudheer kumar reddy


ఐఏఎస్‌ సాధించాలన్న లక్ష్యంతో 2017 నుంచి ఢిల్లీలో కోచింగ్‌ తీసుకున్నారు. సివిల్స్ రాసిన మొదటి, రెండు ప్రయత్నాల్లో పరాజయం పొందినప్పటికీ మూడో ప్రయత్నంలో ఇంటర్వ్యూలో వెనుదిరిగారు. అయినా పట్టువదలకుండా నాలుగోసారి ప్రయత్నం చేసి ఆలిండియా 69వ వరకు సాధించారు.

Yaswanth Kumar Reddy, Civils 15th Ranker: సివిల్స్‌లో నా స‌క్సెస్‌కు కార‌ణం ఇదే.. వీరు లేకుంటే.. 

తమ కుమారుడు పడ్డ కష్టానికి..
యూపీఎస్సీ 2021 సివిల్స్ ఫ‌లితాల్లో ఆలిండియా 69వ ర్యాంక్ వ‌చ్చింద‌ని తెలియ‌గానే సుధీర్ కుమార్ రెడ్డికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలాగే తమ కుమారుడు తమ కలను నెరవేర్చడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.  తమ కుమారుడు పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

UPSC Civils Ranker -2021: పిచ్చోడన్నారు.. తూటాలు దింపారు.. ఈ సివిల్స్ ర్యాంక‌ర్ స్టోరీకి షాక్ అవ్వాల్సిందే.. 

నా ఆప్షనల్‌గా..
సివిల్స్‌లో నా ఆప్షనల్‌గా మాత్రం కెమిస్టీ తీసుకున్నాను. క‌రెంట్ అఫైర్స్ కోసం న్యూస్‌పేప‌ర్లను బాగా చ‌దివే వాడిని. నా ప్రిప‌రేష‌న్‌లో జ‌రుగుతున్న త‌ప్పుల‌ను స‌రిచేసుకుంటు.. ప్రిప‌రేష‌న్‌ కొనసాగించాను.

Ramesh Gholap,IAS officer: మాది నిరుపేద కుటుంబం.. పొట్ట కూటి కోసం గ్రామాల్లో గాజులు అమ్మి

సివిల్స్ సాధించ‌కుంటే..
ఒక వేళ నేను యూపీఎస్సీ సివిల్స్‌లో ర్యాంక్ సాధించ‌కుంటే.. నాకు మంచి ఎడ్యుకేష‌న్ బ్యాగ్రౌండ్ ఉంది క‌నుక‌ విదేశాల్లో ఎంఎస్ చేసేవాడిని.., లేదా ఐటీ రంగంలోకి కూడా వెళ్లేవాడిని. నాకు ఇటీవ‌లే ఐఎఫ్ఎస్ ఇంట‌ర్య్వూ లెట‌ర్ కూడా వ‌చ్చింది.

UPSC Ranker Shivangi Goyal: వీళ్ల హింస‌ను భ‌రించ‌లేక పుట్టింటికి వ‌చ్చా.. ఈ క‌సితోనే సివిల్స్‌ ర్యాంక్ కొట్టానిలా..

వీరి స‌హాకారం కూడా..
వాజీరామ్ ర‌వీంధ‌ర్‌ సార్‌, బాల‌ల‌తా మేడ‌మ్‌, మా సీనియ‌ర్ ధాత్రిరెడ్డి గారు నా విజ‌యానికి ఎంతో స‌హాయప‌డ్డారు.

నా హాబీలు ఇవే..
కాయిన్స్‌ క‌లెక్ష‌న్స్‌, వెబ్‌సీరీస్ ఎక్కువ‌గా చూస్తాను.

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

నేను చ‌దివిన పుస్త‌కాలు ఇవే..
NCERT పుస్త‌కాల‌ను ఎక్కువ‌గా చ‌దివాను. అలాగే పాలిటీకి ల‌క్షీకాంత్‌, హిస్ట‌రికి బిపిన్ చంద్ర మొద‌లైన పుస్త‌కాల‌ను ఎక్కువ‌గా చ‌దివాను. ఇంట‌ర్‌నెట్‌ను ఎక్కువ‌గా ఉప‌యోగించుకున్నాను.

IAS Success Story: మారుమూల పల్లెటూరి యువ‌కుడు.. ఐఏఎస్ కొట్టాడిలా..

నా ఇంట‌ర్య్వూ సాగిందిలా..
ముఖ్యంగా ఇంట‌ర్య్వూలో ప్ర‌భుత్వ ప్ర‌థ‌కాలు, నా హాబీల గురించి అడిగారు.  అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కొత్త జిల్లాల గురించి ఎక్కువ ప్రశ్న‌లను అడిగారు. ఇంకా క‌లెక్ట‌ర్ అంటే ఏమిటీ..? ఇలా మొద‌లైన ప్ర‌శ్న‌ల‌ను నా ఇంట‌ర్య్వూలో అడిగారు.

UPSC Civils Top Ranker Story: ఎలాంటి కోచింగ్ లేకుండానే.. సివిల్స్‌లో టాప్ ర్యాంక్ కొట్టానిలా..

Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

నా ల‌క్ష్యం ఇదే..
నేను ఎల్ల‌ప్పుడు ప్ర‌జా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప‌నిచేశాను. నా పోస్టుని నా వ్య‌క్తిగ‌త ప‌నుల‌కు అసలు వాడుకోకుండా ప‌నిచేస్తాను.

నా స‌ల‌హా :
యువ‌త అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డానికి ప‌ట్టుద‌ల‌తో.. స‌హానంతో ప్ర‌య‌త్నిస్తే ల‌క్ష్యం ఈజీనే. అలాగే క్ర‌మ‌శిక్ష‌ణతో ఉండ‌డం చాలా ముఖ్యం.

Success Story: ఈ లెక్కలే.. న‌న్ను 'ఐఏఎస్‌' అయ్యేలా చేశాయ్‌.. ఎలా అంటే..?

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

Inspirational Story: కూలీ ప‌నులు చేస్తూ చ‌దివా.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా

Published date : 10 Jun 2022 07:41PM

Photo Stories