Skip to main content

UPSC Civils Top Ranker Story: ఎలాంటి కోచింగ్ లేకుండానే.. సివిల్స్‌లో టాప్ ర్యాంక్ కొట్టానిలా..

దేశంలో అత్యున్నత స్థాయి క్యాడర్‌ పోస్టులైన ఐఏఎస్, ఐపీఎస్‌ తదితర ఆలిండియా సర్వీస్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన సివిల్స్‌–2021 తుది ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) మే 30న విడుదల చేసిన విష‌యం తెల్సిందే.
UPSC Civils Top Ranker Ishita Rathi Success Story
UPSC Civils Top Ranker Ishita Rathi

ఈ ఫ‌లితాల్లో ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల ఇషితా రాఠీ ఎలాంటి కోచింగ్ లేకుండానే ఆలిండియా 8వ ర్యాంక్ సాధించి టాప్ 10లో నిలిచారు. ఈ నేప‌థ్యంలో సివిల్స్ ర్యాంక‌ర్ ఇషితా రాఠీ స‌క్సెస్ స్టోరీ మీకోసం..

UPSC Civils Topper Shruti Sharma : సివిల్స్ టాప‌ర్ శృతి శర్మ.. స‌క్సెస్ సిక్రెట్‌ ఇదే..

కుటుంబ నేప‌థ్యం : 

UPSC 2022 Topper Family


ఈమె తల్లిదండ్రులు ఇద్దరూ ఢిల్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. సొంత ప్రిపరేషన్‌తోనే సివిల్స్‌లో విజ‌యం సాధించ‌డం సంతోషంగా ఉందని చెబుతుంది ఇషితా రాఠీ. తన తల్లిదండ్రులను చూస్తూ దేశానికి సేవ చేయాలని కలలు కన్నానని ఆమె తెలిపారు.

Yaswanth Kumar Reddy, Civils 15th Ranker: సివిల్స్‌లో నా స‌క్సెస్‌కు కార‌ణం ఇదే.. వీరు లేకుంటే..

మూడో ప్రయత్నంలో..
యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలను ప్రకటించిన తర్వాత.. టాప్-10లో తన పేరు రావడంతో షాక్ అయ్యానని చెప్పింది ఇషితా రాఠీ. ఈ పరీక్షలో అనిశ్చితి ఉంటుందని.. , ప్రతి ప్ర‌య‌త్నం, గత అటెమ్ట్‌కు చాలా భిన్నంగా ఉంటుందన్నారు. కాబట్టి ఫలితాలు వెలువడే వరకు ఎలాంటి వ్యూహం పని చేసిందో.., ఏది ఫలించలేదో తెలియద‌న్నారు. నేను మూడో ప్రయత్నంలో సివిల్స్‌లో విజ‌యం సాధించాను. ఇతర ఆశావహుల మాదిరిగానే నా ప్రయాణం చాలా కఠినంగానే సాగింది. ఇంత మంచి ర్యాంక్ వస్తుందని నేను ఊహించలేదు. మొదట్లో ఫైనల్‌కు చేరుకుంటానో లేదో కూడా నాకు కచ్చితంగా తెలియలేదు. కానీ మొత్తానికి విజయం సాధించాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంద‌న్నారు.

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

ఎలాంటి కోచింగ్ లేకుండానే..
నేను సివిల్స్‌కు ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు, కానీ నా ఆప్షనల్ సబ్జెక్ట్ అయిన ఎకనామిక్స్ కోసం నిపుణుల సలహాలు తీసుకున్నాను. సిలబస్‌ చూసిన తర్వాత టాపిక్స్‌ను సొంతంగా కవర్ చేయవచ్చని గ్రహించాను. ఇప్పుడు సొంతంగా పరీక్షకు సిద్ధం కావడానికి ఉచిత మెటీరియల్ కూడా అందుబాటులో ఉంది. నాకు ఇలాంటివన్నీ ఎంతో ఉపయోగపడ్డాయ‌న్నారు.

UPSC Civils Ranker -2021: పిచ్చోడన్నారు.. తూటాలు దింపారు.. ఈ సివిల్స్ ర్యాంక‌ర్ స్టోరీకి షాక్ అవ్వాల్సిందే..

నేను చ‌దివిన పుస్త‌కాలు ఇవే..
గత సంవత్సరాల టాపర్స్ సూచనల ఆధారంగా వ్యూహాలను రూపొందించుకున్నట్లు ఇషిత తెలిపారు. ‘జాగ్రఫీ, పాలిటీ వంటి కొన్ని సబ్జెక్టులకు ఎన్‌సీఈఆర్‌టీ(NCERT) బుక్స్ సరిపోతాయి. న్యూస్ పేపర్, కరెంట్ అఫైర్స్ చదవడం కూడా ఉపయోగపడుతుంది. నేను పాలిటీ కోసం లక్ష్మీకాంత్, హిస్టరీ కోసం స్పెక్ట్రమ్‌తో సహా ప్రముఖ యూపీఎస్సీ ప్రిపరేషన్ పుస్తకాలు ప్రిపేర్ అయ్యాను. గత టాపర్స్ సూచించిన బుక్స్ ఫాలో అయ్యాను. రివిజన్స్, సొంతంగా రాసుకున్న నోట్స్ కూడా ఎంతో ఉపయోగపడ్డాయ‌న్నారు.

Ramesh Gholap,IAS officer: మాది నిరుపేద కుటుంబం.. పొట్ట కూటి కోసం గ్రామాల్లో గాజులు అమ్మి

ఇలా చ‌దివితే.. ఈజీనే..

UPSC Civils Preparation Tips


యూపీఎస్సీ అభ్యర్థులు టార్గెట్ స్టడీస్‌పై దృష్టి పెట్టాలని, అన్ని సబ్జెక్టులపై అవగాహన పెంచుకోవాలని చెప్పింది. కొన్ని గంటలపాటు చదువుతూ.. ఆ తర్వాత బ్రేక్ తీసుకున్నానని ఆమె చెప్పింది. నేను ఉద‌యానే త్వరగా నిద్ర లేస్తాను. అయితే సమయాన్ని మనసులో పెట్టుకొని చదవలేదు. కానీ నాకు నేనే సొంతంగా టార్గెట్స్ పెట్టుకునేదాన్ని. కొన్నిసార్లు ఆ టార్గెట్స్ నేను అనుకున్న సమయం కంటే ముందే పూర్తయ్యేవి. మరికొన్నిసార్లు 10 గంటల కంటే ఎక్కువ సమయం పట్టేది. 

UPSC Ranker Shivangi Goyal: వీళ్ల హింస‌ను భ‌రించ‌లేక పుట్టింటికి వ‌చ్చా.. ఈ క‌సితోనే సివిల్స్‌ ర్యాంక్ కొట్టానిలా..

వీటిని క్లియర్ చేయాలంటే..
యూపీఎస్సీ ప్రిపేర‌య్యే అభ్యర్థులకు లాస్ట్ మినిట్ టిప్స్ ఇవ్వమంటే.. ఆత్మవిశ్వాసంతోనే ఉండాలని, పాజిటివ్ పర్సన్స్‌తోనే ఉంటూ ఎగ్జామ్ క్లియర్ చేస్తారని మీకు మీరే హామీ ఇచ్చుకోవాలని చెప్తాను. ప్రస్తుతం ప్రిలిమ్స్‌ ఎగ్జామ్స్ సబ్జెక్టివ్‌గా మారుతున్నాయి. వీటిని క్లియర్ చేయాలంటే లాజిక్స్ అవసరం. ఎగ్జామ్ హాల్‌లో మీ లాజిక్స్ విజయం దిశగా నడిపిస్తాయి’ అని ఇషిత వివరించింది.

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

నా ల‌క్ష్యం ఇదే..
తన తల్లిదండ్రులు పోలీసు అధికారులుగా దేశానికి సేవ చేయడం పట్ల సంతృప్తిగా ఉండడం చూసి తనకు ఐఏఎస్‌ కావాలనే తపన వచ్చిందని.., దేశానికి సేవ చేయడానికి సివిల్ సర్వీసెస్ తనకు మంచి వేదిక అవుతుంది. IAS ఆఫీసర్‌గా మహిళలు, పిల్లల సాధికారత కోసం పనిచేయాలని ఇషిత లక్ష్యంగా పెట్టుకున్నా..

Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

Published date : 08 Jun 2022 06:34PM

Photo Stories