IPS Officers Family Success Story : అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయంటే.. ఆ ఐపీఎస్‌ల ఫ్యామిలీ గుర్తుకురావాల్సిందే.. ఎందుకంటే..
గతంలో అభిషేక్ మహంతి తండ్రి ఏకే మహంతి కూడా ఐపీఎస్ హోదాలో వివిధ ముఖ్యమైన అసెంబ్లీ ఎన్నికలకు కీలక పాత్ర పోషించారు.
ఇప్పుడు కొడుకు కూడా..
ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్‌లో ట్రాఫిక్ డీసీపీ–1గా పనిచేస్తున్న 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతిని కరీంనగర్ పోలీసు కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం అక్టోబర్ 30వ తేదీన (సోమవారం) ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ పనిచేస్తున్న సుబ్బారాయుడిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఆ పోస్టులో నియమించే అధికారులకు సంబంధించి వచ్చిన జాబితాను పరిశీలించిన ఈసీ అభిషేక్ మహంతి పేరును ఖరారు చేసింది. ఎన్నికల సమయంలో, ఇలాంటి పరిస్థితుల్లో పోస్టింగ్ ఇవ్వాలంటే ఈసీ ఆయా అధికారులకు సంబంధించిన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. వారి సమర్థతతో పాటు నిజాయతీ తదితరాలను చూసిన తర్వాతే ఖరారు చేస్తుంది.
కడప ఎస్పీగా..
గత ఏడాదే తెలంగాణ కేడర్‌కు వచ్చిన అభిషేక్ మహంతి 2019లో ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో ఉన్నారు. 2019 నాటి ఏపీ ఎన్నికల సమయంలో ఈయన తిరుపతి అర్బన్ ఎస్పీగా పనిచేస్తున్నారు. అప్పట్లో ఏపీలో పనిచేసిన ఎస్పీలపై ఈసీకి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వివిధ జిల్లాల వారిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం కడప ఎస్పీగా అభి మహంతిని నియమించింది.
ఆ కుటుంబంలో ఎన్నో..
అభిషేక్ మహంతితో పాటు ఆయన కుటుంబంలో కూడా ఎన్నికల పోస్టింగ్స్ సాధారణ అంశంగా మారడం గమనార్హం. అభిషేక్ తండ్రి అజిత్ కుమార్ మహంతి (ఏకే మహంతి) 1975 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈయన హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గానూ పని చేశారు. 2009 ఎన్నికల సమయంలో అప్పటి డీజీపీ ఎస్‌ఎస్‌పీ యాదవ్ విచక్షణారహితంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై వేటు వేసిన ఈసీ ఆ స్థానంలో ఏకే మహంతిని నియమించింది. ఇక అభిషేక్ మహంతి సోదరుడు అవినాష్ మహంతి కూడా 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈయన ప్రస్తుతం సైబరాబాద్‌లో పరిపాలన విభాగం సంయుక్త పోలీసు కమిషనర్‌గా ఉన్నారు.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో..
అవినాష్ మహంతికి కూడా గతంలో ఇదేవిధంగా ఎన్నికల పోస్టింగ్ వచ్చింది. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొడంగల్‌లోని రేవంత్ ఇంటిపై పోలీసులు చేసిన దాడి తీవ్ర వివాదాస్పదమైంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై బదిలీ వేటు వేసింది. ఆ స్థానంలో నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) డీసీపీగా పనిచేస్తున్న అవినాష్ మహంతిని నియమించింది. ఎన్నికల క్రతువును విజయవంతంగా పూర్తి చేసిన ఆయన సీసీఎస్‌కే తిరిగి వచ్చారు.
మహంతి ఫ్యామిలీలో ఇలా ఎందరో..
ఏకే మహంతి మామ (భార్య తండ్రి) దామోదర్ చోట్రాయ్ తొలి సివిల్ సర్వీసెస్ బ్యాచ్ అయిన 1948 బ్యాచ్ ఒడిషా కేడర్ అధికారి. డీజీపీగా పదవీ విరమణ చేశారు. ఏకే మహంతి బావమరిది పీకే సేనాపతి 1967 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఒడిషా కేడర్‌లోనే డీజీపీగా రిటైర్ అయ్యారు.
అవినాస్ మహంతి ఐపీఎస్ సక్సెస్ స్టోరీ..
తండ్రి ఏకే మహంతి లాగే.. నిజాయితీ గల నిక్కచ్చైన అధికారిగా పేరు అవినాస్ మహంతి ఐపీఎస్‌కి. దేనికీ లొంగకుండా.. దేనికి జంకకుండా చట్టం, న్యాయం మాత్రమే రెండు కళ్లుగా చేసుకొని ముందుకు సాగుతున్న అధికారి ఈయన. తండ్రికి తగిన తనయునిగా పేరు తెచ్చుకున్న అవినాష్ విధి నిర్వహణలో దేనికి వెనుకడుగు వేయరు.
చిన్ననాటి నుంచి మొదలు పెడితే ఇప్పుడు నా వృత్తిలో కూడా మా నాన్న ప్రభావం ప్రభావం ఉంది. వ్యక్తిగత జీవితంలో.. వృత్తిపరంగా ప్రత్యంక్షంగానో పరోక్షంగానో మా నాన్న ప్రభావితం చేస్తూనే ఉంటారు. పిల్లలందరూ దాదాపుగా తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు. తెలియకుండానే వాళ్లలాగ ఉండాలని చూస్తారు. బహుశా నేనూ అంతేనేమో. నువ్వే పని చేసినా మనసా వాచా కర్మణా చేయమని చెబుతారు. ఏదైనా సరైందనిపిస్తేనే చేయమని చెప్పేవారు. చట్ట ప్రకారం సరైంది కాదనిపిస్తే నిర్దాక్షిణ్యంగా చేయొద్దని చెబుతారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని చెబుతారు. ఓ అంశంపై విభిన్నమైన వారితో చర్చించినప్పుడు విభిన్నమైన అభిప్రాయాలు వస్తాయి. వాటిని విశ్లేషించి ఏది సరైందో అది చేయమంటారు.
ఐపీఎస్ అధికారి కాకముందు రైల్వేలో..
నేను తొలుత ఐపీఎస్ అధికారి కాకముందు రైల్వేలో పని చేశాను. అందరు మీ ఫాదర్ ను చూశారు కాబట్టి పోలీసు అధికారి అయ్యారని అంటారు. నిజమే చిన్నప్పట్నుంచి ఆయన్ను చూస్తూ పెరిగాను కాబట్టి కచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది. అలాగే కెరియర్ ఆప్షన్ వచ్చినప్పుడు ఆయన ప్రభావమే నాపై పని చేసి ఉంటుదనుకుంటాను. పోలీసు అధికారి ఉద్యోగం మంచి ఉద్యోగం.. చాలా రెస్పెక్ట్ ఉండే జాబ్ ప్రజలకు ఏదైనా మంచి చేసేందుకు ఇక్కడ చాలా స్కోప్ ఉంటుంది. పోలీసు యూనిఫాం వేసుకోవడంలో ఓ ప్రైడ్ ఉంటుంది. పోలీసు ఉద్యోగం చాలా మంచి ఉద్యోగం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సాయం చేసే ఉద్యోగం ఇది.
నాకు ఐపీఎస్ అధికారి కావాలని..
నాకు ఐపీఎస్ అధికారి కావాలని ఎవరూ చెప్పలేదు. పోలీసు కావాలని చిన్నప్పట్నుంచి షేప్ అప్ చేయలేదు. కానీ మా నాన్న చేస్తున్న పనిలో చాలా సంతృప్తిగా గర్వంగా కనిపించే వారు. అయన ఏ ఒక్క రోజు కూడా పోలీసు డిపార్ట్మెంట్ గురించి తప్పుగా కానీ.. కనీసం విమర్శించడం కానీ చేయలేదు. అలాంటి వాళ్లను చూస్తే కచ్చితంగా మనం అట్రాక్ట్ అవుతాం కదా. అలాగే నేను కూడా. నేను ఐపీఎస్ అధికారి కాక ముందు పోలీసు ఉద్యోగం ఎలా ఉంటుదో మా నాన్న చెబుతుండేవారు. వందకు వంద శాతం అలాగే ఉంది. పోలీసు డిపార్ట్మెంట్ లో మంచి వర్క్ కల్చర్ ఉంటుంది. దానికి మనం ఎంత కంట్రిబ్యూట్ చేయగలరనేది ముఖ్యం.
ఆయన లైఫే నాకు ఇన్స్పిరేషన్‌గా..
మా నాన్న చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని మీలాంటి వాళ్లంటుంటారు. స్ట్రిక్ట్‌గా ఉంటే చాలా ఇబ్బందులు అంటారు. కానీ ఆయన ఇబ్బందులు పడటం నేనెప్పుడు చూడలేదు. తాను నమ్మిన దాని కోసం పని చేస్తూ ముందుకు సాగారు. నేనూ అంతే. ఆయనలో ఒక్క లక్షణాన్ని చూసి స్ఫూర్తి కావడం కాదు.. ఆయన లైఫే నాకు ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. పని పట్ల ఆయనకున్న నిబద్ధత చూస్తే ముచ్చటేస్తుంది. నేను ఏదైనా పొరపాటు చేస్తే ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాను. నా స్థానంలో మా నాన్న ఉంటే ఎలా ఆలోచిస్తారని అనుకుంటాను. ఆయనలాగ ఆలోచించి నాకు నేను సరి చేసుకుంటాను. అలా చేయడం నాకు చాలా సమస్యలకు పరిష్కారం చూపుతుంది.
Success Story : సొంతూరికీ వెళ్లకుండా చదివా.. అనుకున్న ప్రభుత్వ ఉద్యోగం కొట్టానిలా..
ఏది చేసినా బాగా పని చేస్తూ పోతే..
రోజు వారి వృత్తిపరమైన వ్యవహారాలు నాన్నతో అప్పుడప్పుడు చర్చిస్తాను. ఆయన పని తీరు చాలా స్టాండర్ట్ గా ఉంటుంది. అలాగే సలహాలిస్తారు కానీ ఎక్కువగా ఇన్వాల్వ్ కారు. ఏది చేసిన మంచి చేయమంటారు. ఆయన అలాగే చేసేవారు. ఒక సమస్యకు ఒకే పరిష్కారం అంతే. అందుకేనేమో ఆయన లైఫ్ లో కాంప్లికేషన్స్ చాలా తక్కువ. వివిధ విభాగాల్లో పోలీసింగ్ వివిధ రకాలుగా ఉంటుంది. డిపార్ట్ మెంట్ లో చాలా శాఖలున్నాయి. దానికి అనుగుణంగా పని చేయాల్సి ఉంటుంది. ఏది చేసినా బాగా పని చేస్తూ పోతే మంచి ఫలితాలు వస్తాయి. మా నాన్న కూడా అలాగే ఉండేవారు. మా తమ్ముడు అభిషేక్ మహంతి కూడా ఆంధ్రప్రదేశ్ కాడర్ ఐపీఎస్ అధికారిగా పనిచేశాడు. ఇప్పుడు తెలంగాణ ఐపీఎస్ ఆధికారిగా పనిచేస్తున్నాడు. మా తమ్ముడికి కూడా మా నాన్నతో దాదాపుగా అలాంటి అనుభవాలే ఉంటాయి. ఎందకంటే.. ఒకే ఇంట్లో పెరిగాం కదా.