Skip to main content

APRCET 2022 Notification: ఏపీలోని వర్సిటీల్లో పీహెచ్‌డీలో చేరే అవకాశం.. విజయానికి అనుసరించాల్సిన ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

APRCET 2022 Notification

పీహెచ్‌డీ కల సాకారం చేసుకునే తరుణం వచ్చింది. ఇందుకు మార్గం.. ఆంధ్రప్రదేశ్‌ రీసెర్చ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీఆర్‌సెట్‌)! ఈ ఎంట్రన్స్‌ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా.. ఏపీలోని యూనివర్సిటీల్లో..పలు విభాగాల్లో 
పీహెచ్‌డీలో ప్రవేశం పొందొచ్చు! తాజాగా.. 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీఆర్‌సెట్‌-2022 నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో.. ఏపీఆర్‌సెట్‌ విధానం, పరీక్ష స్వరూపం, విజయానికి అనుసరించాల్సిన ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

  • ఏపీలోని వర్సిటీల్లో పీహెచ్‌డీలో చేరే అవకాశం
  • అన్ని యూనివర్సిటీల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రక్రియ
  • టెక్నికల్, సైన్స్, ఆర్ట్స్, సోషల్‌ సైన్సెస్, హ్యుమానిటీస్‌లో పీహెచ్‌డీ
  • 2022 సంవత్సరానికి ఏపీఆర్‌సెట్‌ ప్రక్రియ ప్రారంభం

ఏపీఆర్‌సెట్‌లో ప్రతిభ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీల్లో పలు సబ్జెక్ట్‌లలో పీహెచ్‌డీలో చేరొచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలోని 16 యూనివర్సిటీల్లో టెక్నికల్, సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్‌ సైన్సెస్, ఎడ్యుకేషన్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్, లా, ఫార్మాస్యుటికల్‌ సైన్సెస్‌ తదితర విభాగాల్లో 62 సబ్జెక్ట్‌లలో ఏపీఆర్‌సెట్‌ ద్వారా పీహెచ్‌డీలోకి ప్రవేశాలు చేపడుతున్నారు.

చ‌ద‌వండి: Admissions in NSU Tirupati: జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతిలో యూజీ కోర్సుల్లో ప్రవేశాలు

ప్రవేశ పరీక్ష రెండు విధాలుగా

ఏపీఆర్‌సెట్‌ను రెండు విధాలుగా నిర్వహిస్తున్నారు. యూజీసీ-నెట్, సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్, గేట్, జీప్యాట్, స్లెట్, టీచర్‌ ఫెలోషిప్, ఎంఫిల్‌ ఉత్తీర్ణులను కేటగిరీ-1గా; ఆయా సబ్జెక్ట్‌లలో పీజీ చేసిన వారిని కేటగిరీ-2గా పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అర్హత ప్రమాణాల ఆధారంగా ఎంట్రన్స్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు.

రెండు విభాగాలుగా పరీక్ష

  • ఏపీఆర్‌సెట్‌ను సెక్షన్‌-ఎ, సెక్షన్‌-బి పేరుతో రెండు విభాగాలు నిర్వహిస్తారు.
  • సెక్షన్‌-ఎలో రీసెర్చ్‌ మెథడాలజీ నుంచి 70 మార్కులకు పరీక్ష ఉంటుంది.
  • సెక్షన్‌-బిలో దరఖాస్తు చేసుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించి 70 మార్కులకు పరీక్ష ఉంటుంది.
  • ఇలా మొత్తం 140 మార్కులకు ఏపీఆర్‌సెట్‌ను నిర్వహిస్తారు.
  • కేటగిరీ-1 అభ్యర్థులుగా పేర్కొనే యూజీసీ-నెట్, సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్, గేట్, జీప్యాట్, స్లెట్, టీచర్‌ ఫెలోషిప్, ఎంఫిల్‌ ఉత్తీర్ణులకు ఏపీఆర్‌సెట్‌లో సెక్షన్‌-బి నుంచి మినహాయింపు కల్పించారు. వీరు సెక్షన్‌-ఎ(రీసెర్చ్‌ మెథడాలజీ) పరీక్షకు హాజరైతే సరిపోతుంది.
  • మొత్తం రెండు గంటల వ్యవధిలో పరీక్ష జరుగుతుంది.

తదుపరి దశలో ఇంటర్వ్యూ

  • ఏపీఆర్‌సెట్‌లో ఉత్తీర్ణత పొందిన వారికి తదుపరి దశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. కేటగిరీ-1 అభ్యర్థులకు 30మార్కులకు, కేటగిరీ-2 అభ్యర్థులకు 60 మార్కులకు ఈ ఇంటర్వ్యూ ఉంటుంది. 
  • ఈ రెండు దశల్లో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా.. ఎంచుకున్న యూనివర్సిటీ, సంబంధిత సబ్జెక్ట్‌లో అందుబాటులో ఉన్న ఖాళీలను పరిగణనలోకి తీసుకుని.. మెరిట్‌ జాబితా రూపొందించి పీహెచ్‌డీ ప్రవేశం ఖరారు చేస్తారు.

ఉమ్మడి ఎంపిక విధానం

ఏపీఆర్‌సెట్‌లో ఏదైనా ఒక సబ్జెక్ట్‌లో రాత పరీక్షలో విజయం సాధించి, మెరిట్‌ జాబితాలో నిలిచిన వారికి తదుపరి దశలో కేంద్రీకృత విధానంలో ఉమ్మడి వేదికగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఉదాహరణకు కామర్స్‌ సబ్జెక్ట్‌లో రాత పరీక్షలో విజయం సాధించిన వారికి.. నిర్దిష్టంగా ఒక యూనివర్సిటీ వేదికగా ఇంటర్వ్యూలు ఉంటాయి. ఆ ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా వారు దరఖాస్తు చేసుకున్న యూనివర్సిటీలో ప్రవేశం ఖరారు చేస్తారు. ఈ విధానం ఫలితంగా అభ్యర్థులకు ప్రతి యూనివర్సిటీకి వేర్వేరుగా దరఖాస్తు చేసుకునే వ్యయప్రయాసలు ఉండవు.

చ‌ద‌వండి: Admissions in AP Open School Society: ఏపీ సార్వత్రిక విద్యా పీఠంలో ఇంటర్‌ ప్రవేశాలు..

ఫుల్‌ టైమ్, పార్ట్‌ టైమ్‌

  • ఏపీఆర్‌సెట్‌ ద్వారా ఫుల్‌టైమ్, పార్ట్‌ టైమ్‌ రెండు విధానల్లోనూ పీహెచ్‌డీలో ప్రవేశం పొందే అవకాశం ఉంది. 
  • ఫుల్‌టైమ్‌ పీహెచ్‌డీకి 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్ట్‌లో పీజీ ఉత్తీర్ణత ఉండాలి. ఎస్‌సీ, ఎస్టీ, బీసీ (నాన్‌-క్రీమీ లేయర్‌) అభ్యర్థులకు 5 శాతం సడలింపు లభిస్తుంది. 
  • పార్ట్‌ టైమ్‌ పీహెచ్‌డీకి అభ్యర్థులను పలు కేటగిరీలుగా వర్గీకరించారు. ఆయా కేటగిరీల వారీగా పార్ట్‌ టైమ్‌ పీహెచ్‌డీ ప్రవేశాల్లో ప్రవేశం కల్పిస్తారు. 

విజయం సాధించాలంటే

ఏపీఆర్‌సెట్‌కు పోటీ కూడా ఎక్కువగానే ఉంటోంది. కాబట్టి అభ్యర్థులు రాత పరీక్షలో తమ ప్రతిభను చూపాల్సిన ఆవశ్యకత నెలకొంది.

రీసెర్చ్‌ మెథడాలజీ

కేటగిరీ-1, కేటగిరీ-2 రెండు విభాగాలకు చెందిన అభ్యర్థులు హాజరు కావలసిన విభాగం ఇది. ఈ విభాగంలో అభ్యర్థుల్లోని టీచింగ్, రీసెర్చ్‌ దృక్పథాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి కాన్సెప్ట్‌లు, అభ్యాసకుల తీరు, ఉన్నత విద్యలో టీచింగ్‌ పద్ధతులు, ఐసీటీ ఆధారిత టీచింగ్, ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌పై అవగాహన పెంచుకోవాలి.

  • రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి రీసెర్చ్‌ మెథడ్స్, రీసెర్చ్‌ దశలు, థీసిస్‌ రైటింగ్, రీసెర్చ్‌ ఎథిక్స్, రీసెర్చ్‌లో ఐసీటీ వినియోగం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.
  • కాంప్రహెన్షన్‌కు సంబంధించి ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నైపుణ్యాలను పెంచుకోవాలి. సెంటెన్స్‌ ఫార్మేషన్, సెంటెన్స్‌ రీ రైటింగ్‌ వంటి అంశాలపై దృష్టిపెట్టాలి.
  • కమ్యూనికేషన్‌కు సంబంధించిన అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. పలు రకాల కమ్యూనికేషన్‌ సాధనాలు, మాస్‌ మీడియా అండ్‌ సొసైటీ, వెర్బల్‌ అండ్‌ నాన్‌ వెర్బల్‌ కమ్యూనికేషన్, క్లాస్‌ రూమ్‌ కమ్యూనికేషన్‌పై పట్టుసాధించాలి.
  • అర్థమెటిక్‌ అంశాలు రీజనింగ్, కోడింగ్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్‌ వంటి అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి.
  • వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అంశాలను కూడా చదవాలి. పై చార్ట్, బార్‌-చార్ట్, హిస్టోగ్రామ్స్, టేబుల్స్, లైన్‌-చార్ట్‌లను విశ్లేషించే నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి.

సెక్షన్‌-బికి ఇలా

అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రశ్నలు అడిగే విభాగం సెక్షన్‌-బి. ఇందులో రాణించేందుకు పీజీ స్థాయిలో సంబంధిత అకడమిక్‌ పుస్తకాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు దానికి సంబంధించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలి. ముఖ్యంగా పరిశోధనల కోణంలో తాజా పరిణామాల గురించి అవగాహన పెంచుకోవాలి.

మోడల్‌ పేపర్స్‌ సాధన

ఏపీఆర్‌సెట్‌లో విజయానికి మోడల్‌ పేపర్స్‌ సాధన చేయడం దోహదపడుతుంది. అభ్యర్థులు గేట్, నెట్, స్లెట్‌ వంటి ఎంట్రన్స్‌ టెస్ట్‌ల పేపర్లను సాధన చేయాలి. అదే విధంగా ఏపీఆర్‌సెట్‌ గత ప్రశ్న పత్రాలను కూడా సాధన చేయాలి.

మాక్‌ టెస్ట్‌ సదుపాయం

ఏపీఆర్‌సెట్‌ అభ్యర్థులకు మాక్‌ టెస్ట్‌ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. ఫలితంగా ఏపీఆర్‌సెట్‌లో అడిగే ప్రశ్నల సరళి, ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీపై స్పష్టత వస్తుంది. తద్వారా పరీక్షకు ఎలా సన్నద్ధమవ్వాలో తెలుస్తుంది.

ఏపీఆర్‌సెట్‌-2022 ముఖ్య తేదీలు

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్‌ 24
  • రూ.2 వేల ఆలస్య రుసుముతో చివరి తేదీ: అక్టోబర్‌ 5
  • రూ.5 వేల ఆలస్య రుసుముతో చివరి తేదీ: అక్టోబర్‌ 11
  • ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో సవరణలకు అవకాశం: అక్టోబర్‌ 10 - 11 తేదీల్లో
  • హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌: అక్టోబర్‌ 13 నుంచి
  • ఏపీఆర్‌సెట్‌ పరీక్ష తేదీ: అక్టోబర్‌ 16 నుంచి 19 వరకు (ప్రతి రోజు రెండు సెషన్లలో).
  • పరీక్ష కేంద్రాలు: శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, భీమవరం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం, హైదరాబాద్‌
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in/RCET/RCET/RCET_HomePage.aspx

ఫెలోషిప్‌లు కూడా లభించే అవకాశం

ఏపీఆర్‌సెట్‌ ద్వారా ఆయా యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు ఖరారు చేసుకున్న విద్యార్థులకు ఏఐసీటీఈ-టెకిప్‌ (TEQIP), పీఎంఆర్‌ఎఫ్‌ తదితర కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్‌ స్కీమ్‌ల ద్వారా ఫెలోషిప్‌ పొందే అవకాశం కూడా లభిస్తుంది. గేట్, నెట్‌ అర్హతలతో ప్రవేశం పొందిన వారికి సంబంధిత ఫెలోషిప్‌లు లభిస్తాయి. ఇప్పటికే ఆయా ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణత సాధించారనే ఉద్దేశంతో గేట్, నెట్‌ తదితర పరీక్షల ఉత్తీర్ణులకు సెక్షన్‌-బి నుంచి మినహాయింపు కల్పించే విధానం అమలవుతోంది. మొత్తంగా చూస్తే అభ్యర్థులు పలు యూనివర్సిటీలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకునే భారాన్ని తగ్గించడం ఏపీఆర్‌సెట్‌ ప్రధాన ఉద్దేశం.
-ప్రొ'' డి.అప్పలనాయుడు, ఏపీఆర్‌సెట్‌-2022 కన్వీనర్‌

Published date : 22 Sep 2022 06:00PM

Photo Stories