PhD Admissions: పీహెచ్డీ అడ్మిషన్లకు యూజీసీ షాక్.. గైడ్‌షిప్ కాలం కుదింపు!

గతంలో పదవీ విరమణ పొందిన తర్వాత కూడా అధ్యాపకులకు గైడ్‌షిప్ లభించేది. ఉస్మానియా విశ్వవిద్యాలయం 45 పీజీ కోర్సులు నిర్వహిస్తుంది. ఏటా 15 వేల మం ది వివిధ కోర్సుల్లో చేరుతుంటారు. అయితే వర్సిటీ క్యాంపస్లో 1,257 మంది అధ్యాపకుల కుగాను ప్రస్తుతం 376 మందే మాత్రమే పనిచేస్తు న్నారు. వీరిలో వచ్చే మూడేళ్లలో 50 మంది వరకు పదవీ విరమణ చేయనున్నారు. ఆయా అధ్యాప కుల గైడ్షిప్ కాలాన్ని వారి పదవీ విరమణ వయసు కంటే మూడేళ్లు ముందే నిలిపివేయడం తో వారు పీహెచ్డీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చే పరిస్థితి లేకుండాపోయింది.
చదవండి: OU PhD Admissions: ఓయూ పీహెచ్‌డీ కేటగిరీ-2 ప్రవేశాలకు ప్రకటన.. వీరికి నో గైడ్‌షిప్.. గైడ్‌షిప్ అంటే?
ఒక్కో ప్రొఫెసర్ కు ఎనిమిది అడ్మిషన్లు ఇస్తోంది. వచ్చే మూడేళ్లలో 400పైగా పీహెచీ అడ్మిషన్లు దక్కకుండా పోతు న్నాయి. మూడేళ్ల తర్వాత తాజాగా ఓయూలో పీహెచీ ఎంట్రన్స్ టెస్ట్-2025కు ఓయూ పాల కవర్గం నోటీఫికేషన్ జారీ చేసింది.
జనవరి 25 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు స్వీకరిం చనుంది. యూజీసీ నూతన నిబంధనల కారణం గా సీట్ల సంఖ్య 446కు తగ్గింది. సుమారు 50 వేల మంది ఇప్పటికే పీజీలు పూర్తి చేసి, పీహెచ్డీ అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. యూజీసీ నిర్ణయాన్ని అధ్యాపకులు, విద్యార్థులు జీర్ణిం చుకోలేకపోతున్నారు.
![]() ![]() |
![]() ![]() |
విద్యార్థి సంఘాల అభ్యంతరం
యూజీసీ కొత్త నిబంధనలపై పలు విద్యార్థి సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పీహెచ్డీ నోటిఫికేషన్ ను రద్దు చేసి పాత పద్ధ తిలో అడ్మిషన్లకు మరో నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రొఫెసర్ కుమార్ ను కోరారు.