Admissions in AP Open School Society: ఏపీ సార్వత్రిక విద్యా పీఠంలో ఇంటర్ ప్రవేశాలు..
ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ.. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీ, సీఈసీ.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 2022 ఆగస్ట్ 31 నాటికి కనీస వయసు 15 ఏళ్లు. ప్రవేశానికి గరిష్ట వయోపరిమితి లేదు.
బోధనా మాధ్యమం: తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో ఏదైనా ఒక మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.10.2022
నిర్ణీత రుసుముతో అడ్మిషన్ ఫీజు చెల్లింపు చివరితేది: 07.10.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది(ఆలస్య రుసుముతో): 26.10.2022
రూ.200 ఆలస్య రుసుముతో అడ్మిషన్ ఫీజు చెల్లింపు చివరితేది: 28.10.2022
వెబ్‌సైట్: https://www.apopenschool.ap.gov.in/
చదవండి: IIT Jam 2023 Notification: ఐఐటీల్లో ఎమ్మెస్సీ.. పరీక్ష విధానం ఇలా..