Skip to main content

IIT JAM 2023 Notification: ఐఐటీల్లో ఎమ్మెస్సీ.. పరీక్ష విధానం ఇలా..

iit jam 2023 notification

దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో ఎమ్మెస్సీ, ఇతర డ్యుయల్‌ డిగ్రీ, పోస్టు బ్యాచిలర్స్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌(జామ్‌)-2023  నోటిఫికేషన్‌ విడుదలైంది.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్ష విధానం: దీనిలో మొత్తం 7 టెస్ట్‌ పేపర్లు ఉంటాయి. అవి బయో టెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమేటిక్స్, మ్యాథమేటికల్‌ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్‌. జామ్‌-2023 ప్రశ్నా పత్రం మొత్తం ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, ఖమ్మం, గుంటూరు, కరీంనగర్, వరంగల్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.10.2022
జామ్‌2023 పరీక్ష తేది: 12.02.2023
ఫలితాలు వెల్లడి: 22.03.2023.

వెబ్‌సైట్‌: https://jam.iitg.ac.in

చ‌ద‌వండి: JAM-2023 నోటిఫికేషన్‌... ఐఐటీల్లో ఉన్నత చదువులకు మరో మార్గం... పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ టిప్స్‌!

Last Date

Photo Stories