JAM-2023 నోటిఫికేషన్... ఐఐటీల్లో ఉన్నత చదువులకు మరో మార్గం... పరీక్షలో విజయానికి ప్రిపరేషన్ టిప్స్!
బీటెక్ స్థాయిలో అవకాశం చేజారినా.. ఐఐటీల్లో ఉన్నత చదువులకు మరో మార్గం ఉంది.. అదే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్.. జామ్! ఈ ఎంట్రెన్స్ టెస్ట్‌లో స్కోర్ ఆధారంగా.. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలతోపాటు, ఎన్‌ఐటీలు, ఐఐఎస్‌ఈఆర్, ఐఐఎస్‌సీ సహా.. దాదాపు 30 కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్స్‌లో.. ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ + పీహెచ్‌డీ కోర్సుల్లో చేరే అవకాశం లభిస్తుంది!! 2023 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి.. ఐఐటీజామ్2023 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. జామ్2023 నోటిఫికేషన్ వివరాలు, జామ్ స్కోర్‌తో ప్రయోజనాలు, ప్రవేశాలు లభించే కోర్సులు, ఇన్‌స్టిట్యూట్స్, పరీక్షలో విజయానికి ప్రిపరేషన్ టిప్స్...
- జామ్ స్కోర్‌తో ఐఐటీల్లో ఉన్నత విద్య
- మరెన్నో ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశ మార్గం
- జామ్2023 ప్రక్రియ ప్రారంభం
- ఫిబ్రవరి 12, 2023న దేశవ్యాప్తంగా పరీక్ష
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్..సంక్షిప్తంగా జామ్. ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లో మ్యాథమెటిక్స్, సైన్సెస్ విభాగాల్లో ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ+పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష. ప్రతి ఏటా ఈ పరీక్షను నిర్దిష్టంగా ఒక ఐఐటీ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఐఐటీగువహటి జామ్ పరీక్ష నిర్వహణ బాధ్యతలు చూస్తోంది.
టాప్ ఇన్‌స్టిట్యూట్స్2,600 సీట్లు
ఐఐటీజామ్ స్కోర్ ఆధారంగా..21 ఐఐటీల్లో ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ(టెక్), జాయింట్ ఎమ్మెస్సీపీహెచ్‌డీ, ఎమ్మెస్సీపీహెచ్‌డీ(డ్యూయల్ డిగ్రీ), ఎమ్మెస్సీఎంటెక్(డ్యూయల్ డిగ్రీ),ఎంఎస్(రీసెర్చ్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం మూడు వందల సీట్లు ఐఐటీల్లో అందుబాటులో ఉన్నాయి.
ఐఐటీలతోపాటు ఎన్‌ఐటీలు, ఐఐఎస్సీబెంగళూరు, ఐఐఈఎస్‌టీ, ఐఐపీఈ, జేఎన్‌ఎస్‌ఏఆర్, ఎస్‌ఎల్‌ఐఈటీ వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌లో కూడా ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీపీహెచ్‌డీ తదితర మాస్టర్స్ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. వీటిల్లో మొత్తం 2,300 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు
సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా 5.5 సీజీపీఏ ఉండాలి. 2023లో చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
జామ్.. ఏడు పేపర్లు
జామ్ పరీక్షను మొత్తం ఏడు పేపర్లలో నిర్వహిస్తారు. అవి.. బయోటెక్నాలజీ; కెమిస్ట్రీ; ఎకనామిక్స్; జియాలజీ; మ్యాథమెటిక్స్; మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్; ఫిజిక్స్. అభ్యర్థులు గరిష్టంగా రెండు పేపర్లలో పరీక్షకు హాజరవ్వొచ్చు. ఈ విషయాన్ని దరఖాస్తు సమయంలోనే పేర్కొనాల్సి ఉంటుంది.
మూడు విభాగాల్లో జామ్
- జామ్ పరీక్ష మొత్తం మూడు విభాగాల్లో జరుగుతుంది.
- సెక్షన్‌ఎ: ఇందులో 30 మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్(ఎంసీక్యూ)ఉంటాయి. ఇందులో 10 ఒక మార్కు ప్రశ్నలు, 20 రెండు మార్కుల ప్రశ్నలు అడుగుతారు.
- సెక్షన్‌బి: ఈ విభాగంలో 10 మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్(ఎంఎస్‌క్యూ) ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. వీటిలో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉంటాయి. అభ్యర్థులు అడిగిన ప్రశ్నకు సరితూగే సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది.
- సెక్షన్‌సి: ఈ విభాగంలో 20 న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు అడుగుతారు. వీటిలో 1 మార్కు ప్రశ్నలు 10, అలాగే 2 మార్కుల ప్రశ్నలు 10 ఉన్నాయి.
- ఇలా మొత్తం మూడు గంటల వ్యవధిలో వంద మార్కులకు 60 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.
- నెగెటివ్ మార్కింగ్ నిబంధన అమలవుతోంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు కోత విధిస్తారు. ఎంఎస్‌క్యూ, ఎన్‌ఏటీ విభాగాల్లో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు.
ఆన్‌లైన్ అడ్మిషన్ ప్రక్రియ
జామ్‌లో స్కోర్ ఆధారంగా ఐఐటీలు ఆన్‌లైన్ విధానంలో అడ్మిషన్ ప్రక్రియ నిర్వహిస్తాయి. అభ్యర్థులు ఐఐటీల్లో సీట్ల కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం.. జామ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ (జేఓఏపీఎస్)ను అందుబాటులోకి తెస్తారు. అభ్యర్థులు ఈ పోర్టల్‌లో తమ లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకుని.. ఆ తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తి చేయాలి. ఈ దరఖాస్తు సమయంలోనే తమకు ఆసక్తి ఉన్న కోర్సులు, ఇన్‌స్టిట్యూట్‌ల ప్రాథమ్యాలను పేర్కొనాలి. ఆ తర్వాత అభ్యర్థులు సాధించిన స్కోర్, వారు పేర్కొన్న ప్రాథమ్యాలను పరిగణనలోకి తీసుకొని.. ఆన్‌లైన్‌లోనే సీట్ అలాట్‌మెంట్ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం నాలుగు రౌండ్లలో జరుగుతుంది.
విజయానికి మార్గమిదే
ఐఐటీజామ్‌లో విజయం సాధించాలంటే.. అభ్యర్థులు తమ అకడమిక్ సబ్జెక్ట్‌లకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలోని పుస్తకాలను లోతుగా అధ్యయనం చేయాలి. ఆ క్రమంలో సబ్జెక్ట్/పేపర్ వారీగా ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు..
కెమిస్ట్రీ
ఫిజికల్ కెమిస్ట్రీ: బేసిక్ మ్యాథమెటికల్ కాన్సెప్టులు, అటామిక్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, థియరీ ఆఫ్ గ్యాసెస్, సాలిడ్ స్టేట్, కెమికల్ థర్మోడైనమిక్స్, కెమికల్ అండ్ ఫేజ్ ఈక్విలిబ్రియా, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనటిక్స్, అబ్సార్ప›్షన్, స్పెక్ట్రోమెట్రి; ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ స్పెక్ట్రోమెట్రి బేసిక్ కాన్సెప్టులు, ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం, సింథటిక్ అప్లికేషన్స్, క్వాలిటేటివ్ ఆర్గానిక్ అనాలసిస్, ఆరోమాటిక్ అండ్ హెటిరోసైక్లిక్ కెమిస్ట్రీ. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో పిరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, షేప్స్ ఆఫ్ కాంపౌండ్స్, మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ మెటల్స్, బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ.
బయోటెక్నాలజీ
బయాలజీ విభాగానికి సంబంధించి పదో తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు అకడమిక్స్‌ను అధ్యయనం చేయాలి. జనరల్ బయాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ ఫిజియాలజీ, బేసిక్ బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, సెల్ బయాలజీ, మైక్రోబయాలజీ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. కెమిస్ట్రీకి సంబంధించి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ పాఠ్యాంశాలను చదవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్‌లను ఇంటర్ స్థాయిలో చదివితే సరిపోతుంది.
ఎకనామిక్స్
మైక్రో ఎకనామిక్స్, మాక్రో ఎకనామిక్స్,స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్,ఇండియన్ ఎకానమీ,మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్‌లను అధ్యయనం చేయాలి.
జియాలజీ
ప్లానెట్ ఎర్త్, జియో మార్ఫాలజీ, స్ట్రక్చరల్ జియాలజీ, పాలియోంటాలజీ, స్టాటిగ్రఫీ, మినరాలజీ, పెట్రోలజీ, ఎకనామిక్ జియాలజీ, అప్లయిడ్ జియాలజీలపై దృష్టి పెట్టాలి.
మ్యాథమెటిక్స్
సీక్వెన్సెస్ అండ్ సిరీస్ ఆఫ్ రియల్ నంబర్స్, ఫంక్షన్స్ ఆఫ్ వన్/టూ/త్రీ రియల్ వేరియబుల్, ఇంటెగ్రల్ క్యాల్కులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్ క్యాల్కులస్, గ్రూప్ థియరీ, లీనియర్ ఆల్‌జీబ్రా, రియల్ అనాలసిస్ పాఠ్యాంశాలను ప్రిపేరవ్వాలి.
మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్
మ్యాథ్స్‌కు 40 శాతం, స్టాటిస్టిక్స్‌కు 60 శాతం వెయిటేజీ ఉండే ఈ పేపర్‌లో.. మ్యాథ్స్‌కు సంబంధించి సీక్వెన్సెస్ అండ్ సిరీస్, డిఫరెన్షియల్ క్యాల్కులస్, ఇంటెగ్రల్ క్యాల్కులస్, మాట్రిసెస్ చాప్టర్లను అధ్యయనం చేయాలి. స్టాటిస్టిక్స్‌లో ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, స్టాండర్డ్ డిస్ట్రిబ్యూషన్, జాయింట్ డిస్ట్రిబ్యూషన్, సాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్, లిమిట్ థీరమ్స్, ఎస్టిమేషన్, టెస్టింగ్ ఆఫ్ హైపో థీసిస్‌లను అధ్యయనం చేయాలి.
ఫిజిక్స్
మ్యాథమెటికల్ మెథడ్స్, మెకానిక్స్ అండ్ జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ మేటర్, ఆసిలేషన్స్, వేవ్స్ అండ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నటిజం, కైనటిక్ థియరీ, థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, డివైజెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ పాఠ్యాంశాలను అభ్యసనం చేయాలి.
బ్యాచిలర్ స్థాయి పుస్తకాలు
జామ్‌లో ఆయా సబ్జెక్ట్‌లలో పట్టు సాధించడానికి అభ్యర్థులు బ్యాచిలర్ స్థాయి పాఠ్యపుస్తకాలను చదవడం మేలు చేస్తుంది. అదే విధంగా జామ్ పాత ప్రశ్న పత్రాలు, గేట్ సైన్స్ సబ్జెక్ట్‌లకు సంబంధించి ప్రీవియస్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి. కాన్సెప్ట్స్, అప్లికేషన్ అప్రోచ్‌లపై పట్టు సాధించాలి. అప్పుడే పరీక్ష హాల్లో ప్రశ్నను ఏ రూపంలో అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది.
ఐఐటీజామ్ 2023 ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: సెప్టెంబర్ 7 అక్టోబర్ 11
- జామ్ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 12, 2023
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://jam.iitg.ac.in/index.html