Best Certification Courses: సర్టిఫికేషన్స్‌తో.. కెరీర్ షైన్!
- ఐటీ రంగంలో సర్టిఫికేషన్స్‌కు పెరుగుతున్న డిమాండ్
- క్లౌడ్ కంప్యూటింగ్, డేటాసైన్స్, ఏఐ, ఐఓటీలతో అవకాశాలు
- సర్టిఫికేషన్స్ అందిస్తున్న పలు ఐటీ సంస్థలు
విద్యార్థులు అకడమిక్ అర్హతలకే పరిమితం కాకుండా.. లేటెస్ట్ నైపుణ్యాలపై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుత డిజిటల్ యుగంలో అన్నిరకాల కార్యకలాపాలు ఆన్‌లైన్‌లో సాగుతున్నాయి. అందుకే సంస్థలు ఆయా కార్యకలాపాలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన స్పెషలైజ్డ్ స్కిల్స్, సంబంధిత సర్టిఫికేషన్స్ ఉన్న అభ్యర్థులను నియమించుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రస్తుత జాబ్ మార్కెట్ ట్రెండ్స్‌ను గమనిస్తే క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తదితర టెక్నాలజీకి డిమాండ్ నెలకొంది.
చదవండి: Coding and Programming Skills: ఐటీలో కొలువులు.. లక్షల్లో వేతనం..
క్లౌడ్ కంప్యూటింగ్
ఇంటర్నెట్ ఆధారంగా సాఫ్ట్‌వేర్ సేవలు అందించేందుకు వీలుకల్పిస్తున్న టెక్నాలజీ.. క్లౌడ్ కంప్యూటింగ్! ఇది ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ రంగంలో అనివార్యంగా మారింది. విద్యార్థులు క్లౌడ్ కంప్యూటింగ్ నైపుణ్యాలు పొందేందుకు క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిజైన్, క్లౌడ్ విజువలైజేషన్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఒరాకిల్, వీఎం వేర్, సీసీఎన్‌ఏ వంటి సంస్థలు అందిస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్, రెడ్‌హ్యాట్ సర్టిఫైడ్ ఇంజనీర్, వెబ్ డిజైనింగ్, బోర్లాండ్ డేటాబేస్ ఇంజన్ తదితర కోర్సులు కూడా విద్యార్థులకు ఉపయోగపడే సర్టిఫికేషన్స్‌గా చెప్పొచ్చు. వీటితోపాటు గూగుల్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ క్లౌడ్ ఆర్కిటెక్ట్; గూగుల్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ డేటా ఇంజనీర్; ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ సిస్టమ్స్ అండ్ ఆపరేషన్స్ అడ్మినిస్ట్రేటర్; ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ఎజ్యూర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఎక్స్‌పర్ట్, ఎజ్యూర్ ఫండమెంటల్స్, ఎజ్యూర్ అడ్మినిస్ట్రేటర్ అసోసియేట్ వంటి సర్టిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయి.
చదవండి: Tech skills: సైబర్ సెక్యూరిటీ.. కెరీర్ అవకాశాలు, అర్హతలు, నైపుణ్యాలు అందుకునేందుకు మార్గాలు
సైబర్ సెక్యూరిటీ
- సైబర్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఆన్‌లైన్ కార్యకలాపాల భద్రతను పర్యవేక్షించేందుకు సైబర్ సెక్యూరిటీ నిపుణుల సేవలు తప్పనిసరి. అందుకే సంస్థలు ఈ నైపుణ్యాలున్న వారిని నియమించుకుంటున్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేక సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.
- సిస్కో సీసీఎన్‌ఏ సెక్యూరిటీ; సీసీఎన్‌పీ సెక్యూరిటీ; సీసీఐఈ సెక్యూరిటీ, అదే విధంగా ఈసీ కౌన్సిల్ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కోర్సులు, డేటాసెక్యూరిటీ కౌన్సిల్ అందించే సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
చదవండి: Data Scientist Jobs Roles, Salary: డిగ్రీ అవసరం లేకున్నా.. ఈ నైపుణ్యాలు తప్పనిసరి..
డేటా సైన్స్
- ప్రస్తుత పరిస్థితుల్లో ఎమర్జింగ్ కెరీర్‌గా నిలుస్తోంది.. డేటాసైంటిస్ట్. ఈ కొలువు సొంతం చేసుకునేందుకు కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. వీటిని అందించేందుకు ప్రస్తుతం పలు సర్టిఫికేషన్ కోర్సులు సైతం అందుబాటులోకి వచ్చాయి. అవి..
- ఐబీఎం ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఇన్ డేటా ఇంజనీరింగ్ ఫండమెంటల్స్.
- గూగుల్ డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్ సర్టిఫికెట్.
- కోర్స్‌ఎరా/యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్: అప్లైడ్ డేటాసైన్స్ విత్ పైథాన్ స్పెషలైజేషన్.
చదవండి: Blockchain Jobs: ప్రత్యక్ష సంభాషణలు ఉండవు.. అంతా ఆన్‌లైన్‌లోనే...
బ్లాక్ చైన్ సర్టిఫికేషన్
ప్రస్తుత డిజిటల్ యుగంలో పాధాన్యం సంతరించుకుంటున్న మరో టెక్నాలజీ.. బ్లాక్‌చైన్. ఆన్‌లైన్‌లో జరిగే లావాదేవీలను..వికేంద్రీకృత వ్యవస్థలో పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు వినియోగించే టెక్నాలజీగా బ్లాక్ చైన్ నిలుస్తోంది. ఈ టెక్నాలజీని సమర్థంగా వినియోగించాలన్నా.. నిర్వహించాలన్నా.. ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. బ్లాక్‌చైన్ టెక్నాలజీలో పలు సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. బ్లాక్‌చైన్ కౌన్సిల్, గవర్నమెంట్ బ్లాక్‌చైన్ అసోసియేషన్, సెంట్రల్ బ్లాక్‌చైన్ బాడీస్ ఆఫ్ అమెరికా, ఇతర మూక్స్ వంటివి ఆన్‌లైన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అందిస్తున్నాయి. ఎంఐటీ మీడియా ల్యాబ్ తదితర సంస్థలు కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించిన నైపుణ్యాలు అందిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తి చేసుకుంటే.. ఈ-కామర్స్ సంస్థలు మొదలు ప్రభుత్వ శాఖల వరకు ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.
చదవండి: Career Opportunities in Mobile App Development... నైపుణ్యాలు, కొలువులకు మార్గాలు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
- ఇప్పుడు ఏ రంగంలో చూసినా అత్యంత కీలకంగా మారుతున్న టెక్నాలజీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్(ఏఐ, ఎంఎల్). పరిమిత మానవ ప్రమేయంతో సమర్థవంతంగా,వేగంగా కార్యకలాపాలను నిర్వహించేందుకు సంస్థలు ఈ టెక్నాలజీని అనుసరిస్తున్నాయి. ఏఐ, ఎంఎల్ నైపుణ్యాలున్న వారికి కంపెనీలు నియామకాల్లో పెద్దపీట వేస్తున్నాయి. ప్రస్తుతం ఏఐ, ఎంఎల్‌కు సంబంధించి పలు షార్ట్‌టర్మ్ సర్టిఫికేషన్ కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి.
- ఐబీఎం, ఇంటెల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఏఐలో ఆన్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి. వీటి కాల వ్యవధి నెల రోజుల నుంచి నాలుగు నెలల వరకు ఉంటోంది. వీటిని పూర్తి చేసుకుని సంబంధిత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే.. ఇండస్ట్రీ వర్గాల్లో మంచి గుర్తింపు లభిస్తోంది. దేశంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్వల్ప కాలిక కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఐవోటీ
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్.. ఐవోటీ. కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఈ టెక్నాలజీకి ప్రాధాన్యం పెరుగుతోంది. విద్యార్థులు ఆయా రంగాలకు సంబంధించి ఆధునిక నైపుణ్యాలను సముపార్జించుకుంటూనే.. ఐవోటీ స్కిల్స్‌పైనా దృష్టిసారించాలి. ప్రస్తుతం ఐఓటీకి సంబంధించి.. మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ ఐఓటీ డెవలపర్, ఐబీఎం ఐఓటీ, సీసీఎన్‌ఏ, వీఎంవేర్ వంటి సంస్థలు ఐఓటీలో సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిని పూర్తి చేసుకోవడం ద్వారా ఐఓటీ విభాగంలో డెవలపర్, ఆర్కిటెక్ట్, సిస్టమ్ డిజైనర్, రోబో కోఆర్డినేటర్ తదితర ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.
చదవండి: Full Stack Developers: ఫుల్ స్టాక్ డెవలపర్... రూ.లక్షల్లో వార్షిక వేతన ప్యాకేజీలు
ఫుల్‌స్టాక్ డెవలప్‌మెంట్
ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో ఎంతో డిమాండ్ నెలకొన్న మరో సర్టిఫికేషన్.. ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్. వాణిజ్య, వ్యాపార రంగాల్లోని సంస్థలు ఆన్‌లైన్ ద్వారా సేవలందిస్తూ.. దానికి సంబంధించి వినియోగదారులను ఆకర్షించేందుకు సొంతంగా వెబ్‌సైట్లను నడిపిస్తున్న విషయం తెలిసిందే. సదరు వెబ్‌సైట్‌ను యూజర్ ఫ్రెండ్లీగా రూపొందించడం, అందుకు అవసరమైన కోడింగ్, ప్రోగ్రామ్‌లు రాయడం.. అదే విధంగా బ్యాక్ ఎండ్‌లో సర్వర్ సైడ్‌లో ఎలాంటి అవాంతరాలు లేకుండా విధులు నిర్వర్తించేందుకు ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ నిపుణుల అవసరం ఉంటుంది. ఈ స్కిల్స్‌ను అందుకునేందుకు ప్రస్తుతం పలు సర్టిఫికేషన్స్ అందుబాటులోకి వచ్చాయి. యుడెమీ, కోర్స్‌ఎరా వంటి మూక్ ప్రొవైడర్స్ ద్వారా ఆన్‌లైన్ సర్టిఫికేషన్లు పూర్తి చేసుకోవచ్చు.
ఐటీ సంస్థల సర్టిఫికేషన్లు
ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలు సైతం పలు సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి. ఐబీఎం, ఒరాకిల్, ఇంటెల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, సిస్కో వంటి సంస్థలు ప్రత్యేకంగా శిక్షణ విభాగాలను నెలకొల్పి.. ఆన్‌లైన్ విధానంలో ఈ సర్టిఫికేషన్లను అందిస్తున్నాయి.
చదవండి: Job Skills: టెక్ నైపుణ్యాలతో టాప్ కొలువులు.. ప్రత్యేకతలు, నైపుణ్యాలు, భవిష్యత్ అవకాశాలు..
సర్టిఫికేషన్ కోర్సుల వెబ్ పోర్టల్స్
- www.microsoftvirtualacademy.com
- https://www.cisco.com/c/en/us/training-events/training-certifications/certifications.html
- https://grow.google/intl/en_in/certificates/
- https://www.ibm.com/training/credentials
- https://www.cisco.com/c/en/us/training-events/training-certifications/certifications.html
- www.hclcdc.in
- www.education.oracle.com
- https://www.intel.com/content/www/us/en/developer/topic-technology/artificial-intelligence/training/courses.html