Skip to main content

Blockchain‌ Jobs: బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ నిపుణులకు డిమాండ్‌.. అవసరమైన నైపుణ్యాలు ఇవే...

Career opportunities in Blockchain Technology and the skills you need
Career opportunities in Blockchain Technology and the skills you need

ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆన్‌లైన్‌ లావాదేవీలు! ఆర్థిక రంగానికి వెన్నెముకగా భావించే బ్యాంకింగ్‌ మొదలు సేవల రంగం వరకూ.. అన్నింటా ఆన్‌లైన్‌ కార్యకలాపాలే!! ఇలాంటి పరిస్థితుల్లో.. సదరు లావాదేవీలను పారదర్శకంగా.. ఎలాంటి లోపాలు లేకుండా.. హ్యాకింగ్‌కు గురికాకుండా నిర్వహించాల్సిన పరిస్థితి! ఇది ప్రత్యేకమైన సాంకేతికతతోనే సాధ్యం! అదే.. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ!! అందుకే.. ఇప్పుడు బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది. సంస్థలు నైపుణ్యాలున్న వారికి రెడ్‌ కార్పెట్‌ స్వాగతం పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో.. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ అంటే ఏమిటి.. ఈ టెక్నాలజీతో ప్రయోజనాలు.. వినియోగిస్తున్న రంగాలు..అవసరమైన నైపుణ్యాలు.. అందుకోవడానికి మార్గాలపై ప్రత్యేక కథనం.. 

 • బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ నిపుణులకు డిమాండ్‌
 • అనేక రంగాల్లో అమలవుతున్న బ్లాక్‌ చైన్‌
 • నైపుణ్యాలు పొందేందుకు ప్రత్యేక కోర్సులు

లావాదేవీలు వికేంద్రీకృత వ్యవస్థ ద్వారా నిర్వహిస్తూ.. ఎలాంటి అవకతవకలు జరగకుండా.. హ్యాకింగ్‌కు గురికా కుండా..సమాచారాన్ని అత్యంత భద్రంగా ఉంచేదే.. బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ. ముఖ్యంగా ప్రస్తుతం ఆర్థిక పరమైన లావా దేవీలు,  భూముల రిజిస్ట్రేషన్, క్రిప్టో కరెన్సీ వంటివి ఆన్‌లై న్‌లోనే నిర్వహిస్తున్నారు. ఇలాంటి లావాదేవీల్లో ఎలాంటి మోసాలు జరగకుండా బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ రక్షణ కల్పిస్తుంది. గత కొన్నేళ్లుగా బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ అనేక రంగాలకు విస్తరించింది.  

పటిష్ట సైబర్‌ రక్షణ
నిర్దిష్టంగా ఒక లావాదేవీని వికేంద్రీకృత వ్యవస్థలో పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.  ప్రస్తుతం ఈ టెక్నాలజీ వినియోగం, దానికి సంబంధించిన అప్లికేషన్స్‌పై పెద్ద కస రత్తే జరుగుతోంది. బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ అనేది ఒక పటి ష్టమైన సైబర్‌ రక్షణ వ్యవస్థగా పేర్కొనొచ్చు. ఏదైనా ఒక విలువైన లావాదేవీని నిర్వహించే సమయంలో.. అది ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాకింగ్‌కు గురి కాకుండా భద్రత కల్పించే టెక్నాలజీ ఇది. సదరు లావాదేవీ నిర్వహణలో పాల్పం చుకునే వ్యక్తులు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా నిరోధించే డిస్ట్రిబ్యూటెడ్‌ నెట్‌వర్క్‌గా ఇది నిలుస్తోంది. 

వికేంద్రీకృత వ్యవస్థ

 • బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ.. వికేంద్రీకృత విధానంలో.. లావా దేవీలను పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహిస్తుంది. ఉదాహరణకు బ్యాంకింగ్‌ రంగాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. నగదు నిర్వహణ లేదా రుణ మంజూరు వంటి విషయాల్లో అనేక దశలు ఉంటాయి. ఒక్కో దశలో ఒక్కో వ్యక్తి/అధికారి కీలక పాత్ర పోషిస్తారు. కొన్నిసార్లు ఏదో ఒక దశలో ఎక్కడో ఒక చోట అవక తవకలకు ఆస్కారం ఉంటుంది. కానీ అదే లావాదేవీని బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ సహాయంతో నిర్వహిస్తే..ఎలాంటి అక్రమాలకు ఆస్కారం ఉండదు. 
 • బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీలో.. ప్రతి లావాదేవీలో భాగస్వా ములైన వారందరి వివరాలు ఒక్కో బ్లాక్‌గా ఏర్పడతా యి. ఒక బ్లాక్‌లో ఉన్న వారితో కొత్త లావాదేవీ జరిగితే.. అది అంతకుముందే ఏర్పడిన బ్లాక్‌కు అనుబంధంగా మరో ప్రత్యేకమైన బ్లాక్‌గా ఏర్పడుతుంది. ఇలా బ్లాక్‌లన్నీ చైన్‌ మాదిరిగా రూపొందుతాయి. ఈ మొత్తం చైన్‌లో ఏ బ్లాక్‌లోనైనా.. ఏ చిన్న మార్పు జరిగినా.. ఆ లావాదేవీ జరిగిన బ్లాక్‌లో నమోదవుతుంది. ఇది సదరు నెట్‌వర్క్‌లో నిక్షిప్తం అవుతుంది. దీంతో..ఏదైనా తేడా వస్తే.. సదరు చైన్‌లోని వారందరికీ తెలిసిపోతుంది. అం టే.. ఏ స్థాయిలోనూ ఏ ఒక్క వ్యక్తి కూడా సొంతంగా, అనధికారికంగా, ఎలాంటి మార్పు చేయలేని పరిస్థితి నెలకొంటుంది. ఫలితంగా మోసాలు అరికట్టేందుకు సాధ్యమవుతుంది. ఒకవేళ సదరు  లావాదేవీలో.. ఏదై నా మార్పు చేయాల్సి వస్తే.. సదరు డిస్ట్రిబ్యూటెడ్‌æనెట్‌ వర్క్‌లోని అధీకృత అధికారులు లేదా వ్యక్తులందరూ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీనికోసం వారికి ప్రత్యేకంగా హ్యాష్‌ ‘కీ’ పేరిట పాస్‌వర్డ్‌ కేటాయిస్తారు. 

అన్ని రంగాలకు విస్తరణ 

 • వాస్తవానికి బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని.. దశాబ్ద కాలం క్రితమే బిట్‌ కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీ లావాదేవీల కోసం రూపొందించారు. క్రిప్టో కరెన్సీలో వ్యక్తుల మధ్య ప్రత్యక్ష సంభాషణలు ఉండవు. అంతా ఆన్‌లైన్‌లోనే సాగుతుంది. దీనికి సంబంధించి సైబర్‌ దాడుల నుంచి రక్షణతోపాటు, అవకతవకలు జరగకుండా ఈ టెక్నాలజీని వినియోగించారు.
 • బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ పనితీరు అత్యంత సమర్థంగా ఉండ టంతో.. ఇతర రంగాలు దీన్ని అందిపుచ్చుకుంటు న్నాయి. ముఖ్యంగా నగదు, ఇతర ఆర్థిక లావాదేవీలు నిర్వహించే బ్యాంకింగ్‌ రంగం బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో రిటైల్, ఈ–కామర్స్, మొబైల్‌ వ్యాలెట్స్, హెల్త్‌కేర్‌ విభాగాలు నిలుస్తున్నాయి. 
 • ప్రభుత్వ విభాగాల్లో సైతం ఇటీవల కాలంలో బ్లాక్‌ చైన్‌ ఆధారిత కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ప్రధానం గా భూముల రిజిస్ట్రేషన్స్‌లో ఈ టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉంటోంది. 
 • ఎన్నికల సంఘం కూడా బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ సాయం తో.. ఓటర్ల జాబితాను అనుసంధానం చేయడంతో పాటు, ఎక్కడి నుంచైనా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చేసే యోచనలో ఉంది. 
 • హెల్త్‌కేర్‌ రంగంలో.. రోగులకు నిర్వహించే పరీక్షల వివరాలను బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ విధానంలో నమోదు చేస్తున్నారు. ఫలితంగా పారదర్శకంగా సదరు పరీక్షల నిర్వహణతోపాటు సమయం వృథా కాకుండా.. బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ దోహదపడుతోంది. 

చ‌ద‌వండి: Higher Education: ఎంబీఏలో చేరాలా.. లేదా ఎంసీఏ బెటరా?!

కెరీర్‌ స్కోప్‌

 • ప్రస్తుతం అన్ని రంగాల్లో డిజిటలైజేషన్‌ ఊపందుకుంది. సంస్థలు ఆన్‌లైన్‌ కార్యకలాపాల్లో పారదర్శకత, భద్రత కోసం బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ నిపుణులను నియమించు కుంటున్నాయి. 2022 నాటికి అంతర్జాతీయంగా ఐటీ రంగంలోని కొలువుల్లో దాదాపు పదిహేను శాతం బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ విభాగంలోనే ఉంటాయని అంచనా. 
 • బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీకి సంబంధించి ఆయా రంగాల్లోని కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన సాఫ్ట్‌వేర్స్‌ను, ప్రోగ్రామ్స్‌ను రూపొందించడం తప్పనిసరిగా మారు తోంది. ముఖ్యంగా క్రిప్టోగ్రఫీ నెట్‌వర్క్స్, డిస్ట్రిబ్యూటెడ్‌ సిస్టమ్స్, గేమ్‌ థియరీ వంటి వాటికి సంబంధించి ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు పొందాలి. సాలిడిటీ ప్రోగ్రా మింగ్‌ నేర్చుకోవడం ద్వారా కూడా అవకాశాలు అందుకునే వీలుంది. 

చ‌ద‌వండి: Cyber Security: ఈ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే... జాబ్‌ గ్యారెంటీ!

కంప్యూటర్‌ సైన్స్‌కు అనుకూలం
బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ రంగం.. కంప్యూటర్‌ సైన్స్‌ విద్యా ర్థులకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. సాఫ్ట్‌వేర్‌ ఆధారిత సెక్యూరిటీ వ్యవస్థగా పేర్కొంటున్న బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీని రూపొందించడానికి అవసరమైన ప్రోగ్రా మింగ్, అల్గారిథమ్స్, డేటాస్ట్రక్చర్స్, జావా, ఆర్, పైథాన్‌ వంటివి సీఎస్‌ఈ విద్యార్థులు సులభంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. దీంతో సీఎస్‌ఈ అభ్యర్థులు బ్లాక్‌చైన్‌ రంగంలో రాణించేందుకు వీలుంటుంది. 

చ‌ద‌వండి: New Courses in IIM: ఇక్కడ విద్యనభ్యసించిన వారికి... టాప్‌ కంపెనీల్లో ఉద్యోగం

ప్రత్యేక కోర్సులు
బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ నిపుణులకు జాబ్‌ మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుతోంది.  దాంతో విద్యాసంస్థలు.. బ్లాక్‌చై న్‌పై ప్రత్యేక కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. ఐఐటీ–మద్రాస్, ఐఐటీ–హైదరాబాద్, ఐఐటీ–ముంబై వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లు బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీలో ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్స్‌ను అందిస్తున్నాయి. అదే విధంగా బ్లాక్‌చైన్‌ కౌన్సిల్, గవర్నమెంట్‌ బ్లాక్‌చైన్‌ అసోసియేషన్, సెంట్రల్‌ బ్లాక్‌చైన్‌ బాడీస్‌ ఆఫ్‌ అమెరికా, ఇతర మూక్స్‌ సైతం ఆన్‌లైన్‌ సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్స్‌ ద్వారా శిక్షణ ఇస్తున్నాయి. 

చ‌ద‌వండి: latest jobs notifications

ఉద్యోగాలు
గ్లాస్‌ డోర్‌ సంస్థ అంచనాల ప్రకారం–అంతర్జాతీయ స్థాయిలో బ్లాక్‌ చైన్‌ రంగంలో ఉద్యోగాలు గత ఏడాది మూడు వందల శాతం పెరిగాయి. మొత్తం ఉద్యోగాల్లో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. అదే విధంగా లింక్డ్‌ ఇన్‌ సర్వే ప్రకారం–2020లో టాప్‌ మోస్ట్‌ జాబ్‌ సెర్చెస్‌లో బ్లాక్‌ చైన్‌ ముందంజలో నిలవగా.. బ్లాక్‌ చైన్‌ డెవలపర్‌ ఉద్యోగాలు 330 శాతం పెరిగాయి. 

బ్లాక్‌ చైన్‌.. జాబ్‌ ప్రొఫైల్స్‌
బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ రంగంలో.. బ్లాక్‌ చైన్‌ డెవలపర్, బ్లాక్‌ చైన్‌ ఆర్కిటెక్ట్, బ్లాక్‌ చైన్‌ అడ్మినిస్ట్రేటర్, ప్రాజెక్ట్‌ మేనేజర్, బ్లాక్‌ చైన్‌ యుఎక్స్‌ డిజైనర్, క్వాలిటీ ఇంజనీర్, కన్సల్టెంట్, బ్లాక్‌ చైన్‌ లీగల్‌ కన్సల్టెంట్, బ్లాక్‌ చైన్‌ ఇంజనీర్, అనలిస్ట్,సెక్యూరిటీ మేనేజర్, కమ్యూనిటీ మేనేజర్, జూని యర్‌ డెవలపర్స్‌ తదితర జాబ్‌ ప్రొఫైల్స్‌ లభిస్తున్నాయి.

ఉపాధి వేదికలు
ఇండియన్‌ బ్లాక్‌ చైన్‌ ఇన్‌స్టిట్యూట్‌ గణాంకాల ప్రకా రం–ప్రస్తుతం దేశంలో.. ఐటీ సంస్థలు, ఫైనాన్షియల్‌ రంగాలు ముందంజలో నిలుస్తున్నాయి. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌–46 శాతం, ఇండస్ట్రియల్‌ ప్రొడక్ట్స్‌ అండ్‌ మాన్యు ఫ్యాక్చరింగ్‌–12 శాతం, ఎనర్జీ అండ్‌ యుటిలిటీస్‌–12 శాతం,హెల్త్‌కేర్‌–11 శాతం, ప్రభుత్వ విభాగాలు–8 శాతం, రిటైల్‌ అండ్‌ కస్టమర్‌ సర్వీసెస్‌–4 శాతం, ఎంటర్‌టైన్‌ మెంట్‌ అండ్‌ మీడియా–1శాతం మేర అవకాశాలు కల్పిస్తున్నాయి. 

టెక్‌ స్కిల్స్‌
బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ రంగంలో కొలువులు సొంతం చేసుకోవాలంటే.. దీనికి సంబంధించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్స్, ప్రోగ్రామింగ్స్, సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌పై అవగాహన తప్పనిసరి. ప్రాథమికంగా కోడింగ్‌ స్కిల్స్, సి++,  డాట్‌ నెట్, ఎక్స్‌ఎంఎల్, పైథాన్, డెవ్‌ అప్స్, జనరిక్‌ ఎస్‌క్యూ ఎల్, హెచ్‌టీఎంఎల్, డేటాసైన్స్, నెట్‌ వర్క్‌ ప్రొటోకాల్స్, యూఐ డిజైన్‌ తదితర స్కిల్స్‌ ఉండాలి.  

కోర్సులు అందిస్తున్న సంస్థలు
https://www.udemy.com/blockchain101/ 
https://www.courseera.org/learn/cryptocurrency
https://edx.org/course/blockchain-business-introduction-linuxfoundation-lfs171x 


 

Published date : 27 Oct 2021 07:18PM

Photo Stories