New Courses in IIM: ఇక్కడ విద్యనభ్యసించిన వారికి... టాప్ కంపెనీల్లో ఉద్యోగం
ఐఐఎం నాగ్‌పూర్–డేటా సైన్స్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం), నాగ్‌పూర్. ఈ ఏడాది ‘డేటా సైన్స్ ఫర్ బిజినెస్ ఎక్స్‌లెన్స్ అండ్ ఇన్నోవేషన్’లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. మిడ్ కెరీర్ నిపుణుల అవసరాలకు అనుగుణంగా కోర్సును రూపొందించినట్టు ఐఐఎం, నాగ్‌పూర్ ప్రకటించింది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ తమ ప్రస్తుత ఉద్యోగాల్లో మరింత సమర్థవంతంగా పనిచేయడానికి, కెరీర్‌లోఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా ఈ కోర్సును సిద్ధం చేశారు. ఈ పీజీ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ కాల వ్యవధి 9 నెలల నుంచి 12 నెలలు.
వివరాలకు వెబ్‌సైట్: https://www.iimnagpur.ac.in/
ఐఐఎం జమ్మూ–ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ
జమ్మూలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)... వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం రెండేళ్ల ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్‌ను కొత్తగా అందుబాటులోకి తెచ్చింది. ఈ కోర్సు బ్లెండెడ్ మోడ్‌లో.. అంటే.. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విధానంలో అందిస్తారు. ఆసక్తి గలవారు ఈ కోర్సుకు జూలై 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సీఏ, సీఎస్, ఐసీడబ్లు్యఏ వంటి ప్రొఫెషనల్ అర్హతలు ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలకు వెబ్‌సైట్: http://www.iimj.ac.in/programs/emba/emba_glance
ఐఐఎం కోజికోడ్–సర్టిఫికెట్ ప్రోమ్స్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), కోజికోడ్.. బిజినెన్, స్ట్రాటజీ, మార్కెటింగ్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో నాలుగు సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్‌ను కొత్తగా ప్రారంభించింది. ప్రతి ప్రోగ్రామ్ కాల వ్యవధి 6 నుంచి 8 నెలల పాటు ఉంటుంది. వీటితోపాటు మరో ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ అనలిటిక్స్ అండ్ హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్‌ను ప్రారంభించింది.
వివరాలకు వెబ్‌సైట్: https://iimk.ac.in/
వైద్యుల కోసం–ఐఐఎం ఇండోర్
ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ప్రంట్‌లైన్‌లో ఉండి సేవలు అందిస్తున్న వైద్యుల కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెనేజ్‌మెంట్(ఐఐఎం), ఇండోర్..‘లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్’ను అందుబాటులోకి తెచ్చింది. ఎంపిక చేసిన 100 మంది వైద్యులకు ఆన్‌లైన్‌లో పూర్తి ఉచితంగా అందించనున్నట్టు ఈ ఐఐఎం ప్రకటించింది.
వివరాలకు వెబ్‌సైట్: https://www.iimidr.ac.in/executiveprogrammes/kritajna2021