CPGET Notification 2024: ఈ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు సీపీజీఈటీ–2024 నోటిఫికేషన్!
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, మహిళా విశ్వవిద్యాలయాలు, జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని పీజీ కళాశాలల్లో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం సీపీజీఈటీ–2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు
» పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు: ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంటీఎం, ఎంకాం, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంఎల్‌ఐబీఎస్సీ, బీఎల్‌ఐబీఎస్సీ.
» ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు: బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ/ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఎకనామిక్స్, ఐఎంబీఏ.
» పీజీ డిప్లొమా కోర్సులు: చైల్డ్ సైకాలజీ, ఫ్యామిలీ మ్యారేజ్ కౌన్సిలింగ్, ఫోరెన్సిక్ సైన్స్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్.
» అర్హత: పీజీ కోర్సులకు డిగ్రీలో కనీసం 40 శాతం మార్కులు, బీఈడీ/బీపీఈడీ కోర్సులకు డిగ్రీలో 55 శాతం మార్కులు, ఇంటిగ్రేటెడ్ కోర్సులకు 10+2/ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.
» ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ రూల్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
» ప్రవేశ పరీక్ష: సంబంధిత సబ్జెక్ట్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) ద్వారా నిర్వహిస్తారు.
» దరఖాస్తు ప్రారంభతేది: 18.05.2024.
» ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులకు చివరితేది: 17.06.2024.
» రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 25.06.2024.
» రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 30.06.2024.
» ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష తేది: 05.07.2024.
» వెబ్‌సైట్: https://cpget.tsche.ac.in