Skip to main content

STEM: ఈ కోర్సులతో ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు

సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌.. సంక్షిప్తంగా స్టెమ్‌! వీటిల్లో ఎందులో నైపుణ్యం సాధించినా.. కెరీర్‌కు ఢోకా ఉండదు. ప్రోగ్రామింగ్‌ నుంచి పరిశోధనల వరకూ.. నచ్చిన కెరీర్‌ను ఎంచుకోవచ్చు. అమెరికా మొదలు ఆస్ట్రేలియా దాకా.. ఎక్కడైనా అవకాశాలు అందుకోవచ్చు. అందుకే మన విద్యార్థులు దేశవిదేశాల్లో స్టెమ్‌ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో.. స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌తో ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై ప్రత్యేక కథనం..
Higher Education and Employment Opportunities with STEM Programs
  • స్టెమ్‌ కోర్సులతో విస్తృత విద్య, ఉద్యోగావకాశాలు
  • విదేశాల్లో మన స్టెమ్‌ నిపుణులకు డిమాండ్‌
  • స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌లో చేరేందుకు విద్యార్థుల ఆసక్తి

స్టెమ్‌.. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌లను సమ్మిళితం చేస్తూ.. అమెరికాలో వీటిని ప్రత్యేక ప్రోగ్రామ్స్‌గా పరిగణిస్తున్నారు. మన దేశంలోనూ ఈ కోర్సులకు ప్రాధాన్యం పెరుగుతోంది. కారణం.. ఆవిష్కరణలకు ఊతమిచ్చే సైన్స్‌ మొద­లు నేటి డిజిటల్‌ యుగంలో ఏఐ వరకూ.. స్టెమ్‌ స్కిల్స్‌ కీలకంగా మారుతుండడమే! ఆయా విభాగాల్లో ఆసక్తి ఉన్న వారు అకడమిక్‌ స్థాయి నుంచే వీటిపై పట్టు సాధిస్తే.. ఉజ్వల అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.

స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌
సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌.. ఈ నాలుగు విభాగాలను కలిపి సంక్షిప్తంగా స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌గా పిలుస్తున్నారు. కారణం..ఈ నాలుగు విభాగాలు ఒకదానికొకటి అనుసంధానంగా ఉండటమే. ఉదాహరణకు లేటెస్ట్‌ టెక్నాలజీస్‌ను ఆవిష్కరించే క్రమంలో సైంటిస్ట్‌లు.. సైన్స్, మ్యాథమెటిక్స్‌ సూత్రాలను అన్వయించాల్సి ఉంటుంది.ఇదే విధంగా ఇంజనీరింగ్‌కు మూలం సైన్స్, మ్యాథ్స్‌ సిద్ధాంతాలే. దీంతో.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనల్లో స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌కు ప్రాధాన్యం ఏర్పడింది.

చ‌ద‌వండి: AI & Chat GPT: ఫ్యూచర్‌ కెరీర్‌.. ప్రాంప్ట్‌ ఇంజనీర్‌!

నిపుణుల కొరత
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్టెమ్‌ విభాగాల్లో నిపుణుల కొరత ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. యూఎస్, యూకే, కెనడా, జర్మనీ, చైనా, భారత్‌.. ఇలా అన్ని దేశాల్లోనూ స్టెమ్‌ నిపుణులకు డిమాండ్‌ నెలకొంది. నేటి ఏఐ, రోబోటిక్స్‌ టెక్నాలజీ యుగంలో పరిశోధనలు, ఆవిష్కరణలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఫలితంగా స్టెమ్‌ నిపుణుల సేవల అవసరం పెరుగుతోంది. జర్మనీలో స్టెమ్‌ విభాగంలో దాదాపు 2.5 లక్షల మంది నిపుణుల అవసరం ఉన్నట్లు అంచనా. అమెరికాలో దాదాపు 10 లక్షల మంది నిపుణులకు డిమాండ్‌ నెలకొంది. అదే విధంగా..యూకేలోనూ ఈ ఏడాది చివరి నాటికి 6.5 లక్షల మంది స్టెమ్‌ నిపుణుల అవసరం ఉంటుందని అంచనా.

సైన్స్, మ్యాథమెటిక్స్‌
ప్రస్తుతం ఎక్కువ మంది టెక్నాలజీ, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరుతున్నారు. కారణం.. ఈ విభాగాల్లో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు లభిస్తుండటమే! ఫలితంగా ప్యూర్‌ సైన్సెస్, మ్యాథమెటిక్స్‌లో అడుగుపెట్టే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. దీంతో సైన్స్, మ్యాథమెటిక్స్‌లలో నిపుణుల కొరత సమస్యగా మారింది. అంతేకాకుండా ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులు పూర్తి చేసుకున్నప్పటికీ.. పరిశ్రమ అవసరాలకు తగ్గ స్కిల్స్‌ ఉన్న వారి సంఖ్య ఆశించిన స్థాయిలో లేదు. ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీలుగా పేర్కొంటున్న ఏఐ, బిగ్‌ డేటా, ఐఓటీ వంటి విభాగాల్లో నిపుణుల కొరత దాదాపు 40 శాతం మేరకు ఉంది.

చ‌ద‌వండి: Software Jobs: ఇంటర్‌తో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు.. ఎంపిక ఇలా..

పెరుగుతున్న ఆసక్తి
స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. మన దేశంలో గత కొన్నేళ్లుగా స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌లో చేరే వారి సంఖ్య గణనీయంగా ఉంది. సైన్స్, టెక్నాలజీ విభాగాల్లో ఉపాధి అవకాశాలతోపాటు రీసెర్చ్‌ అభ్యర్థులకు ప్రభుత్వాలు పలు ప్రోత్సాహకాలు అందించడమే ఇందుకు కారణం. అంతర్జాతీయంగా కూడా అమెరికా, రష్యా, యూకే, కెనడా వంటి దేశాలు స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌లో పరిశోధనలకు పెద్దపీట వేస్తున్నాయి. దీంతో అక్కడ కూడా ఉపాధి అవకాశాలు అందుకునేందుకు వీలవుతుంది. 

స్కూల్‌ స్థాయి నుంచే ప్రోత్సాహం
సైన్స్, మ్యాథమెటిక్స్‌లో పరిశోధనలు, ఆవిష్కరణలు పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. అందుకోసం హైస్కూల్‌ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు సైన్స్, మ్యాథమెటిక్స్‌ విద్యార్థులకు పలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. యూనివర్సిటీ స్థాయిలో పీహెచ్‌డీ విద్యార్థులకు ఇచ్చే ఫెలోషిప్‌లను సైతం ఇటీవల ప్రభుత్వం పెంచింది. స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌ ద్వారా నైపుణ్యాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ పేరుతో ప్రత్యేక ఇన్‌స్టిట్యూట్స్‌ను నెలకొల్పింది. సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఐఐటీల్లో సైన్స్, మ్యాథమెటిక్స్‌ మేజర్స్‌గా ప్రత్యేక కోర్సులను సైతం ప్రవేశపెట్టారు.

చ‌ద‌వండి: Job Trends: స్కిల్‌ ఉంటేనే.. కొలువు!

బిజినెస్‌ స్కూల్స్‌.. స్టెమ్‌ బాట
మేనేజ్‌మెంట్‌ విద్యను అందించే ఇన్‌స్టిట్యూట్స్‌ సైతం ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌ను ప్రారంభిస్తున్నాయి. ప్రధానంగా డేటా సైన్స్, డేటా అనలిటిక్స్‌ కోర్సులను బోధిస్తున్నాయి. వీటితోపాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ),మెషీన్‌ లెర్నింగ్‌లకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయి. కార్పొరేట్‌ ప్రపంచంలో డేటా అనలిటిక్స్‌కు ప్రాధాన్యం పెరగడం, అనలిటిక్స్‌లో నైపుణ్యానికి టెక్‌ స్కిల్స్‌ పునాదిగా నిలవడం ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఎంబీఏ విద్యార్థులకు డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, డేటా మేనేజ్‌మెంట్‌పై అవగాహన కల్పిస్తే.. అటు మేనేజ్‌మెంట్‌తోపాటు ఇటు టెక్‌ స్కిల్స్‌ కూడా సొంతమై కార్పొరేట్‌ వర్గాల నుంచి మరింత ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. 

స్టెమ్‌తో నైపుణ్యాలు
స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌ పూర్తి చేసుకుంటే లభించే సబ్జె­క్ట్, టెక్నికల్‌ నైపుణ్యాలతోపాటు పలు ఇతర స్కిల్స్‌ లభిస్తాయని చెప్పొచ్చు. ఇందులో ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్, అనలిటికల్‌ స్కిల్స్, రీసెర్చ్‌ ఓరియెంటేషన్‌ స్కిల్స్‌ ముఖ్యమైనవి. ఫలితంగా ఆయా విభాగాల్లో భవిష్యత్తులో విధుల నిర్వహణపరంగా మె­రుగైన పనితీరు కనబరుస్తారని కంపెనీల భావన.

ఆకర్షణీయ వేతనాలు
స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌ ఉత్తీర్ణులకు కంపెనీలు ఆకర్షణీయమైన వేతనాలు అందిస్తున్నాయి. గ్రాడ్యుయేషన్‌ స్థాయి కోర్సులు పూర్తిచేసుకున్న వారికి స్కిల్స్‌ ఉంటే ప్రారంభంలోనే సగటున నెలకు రూ.30 వేల వేతనం లభిస్తోంది. పీజీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు వారి స్పెషలైజేషన్‌కు అనుగుణంగా నెలకు గరిష్టంగా రూ.50 వేల వేతనం అందుతోంది. పీహెచ్‌డీ అభ్యర్థులకు రూ.లక్ష వరకు వేతనం ఇవ్వడానికి సైతం సంస్థలు సిద్ధంగా ఉంటున్నాయి.

అవకాశాలు
స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆర్‌ అండ్‌ డీ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నా­యి. ఇవే కాకుండా.. మాన్యుఫ్యాక్చరింగ్‌ సంస్థలు, బయో మెడికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్స్, హెల్త్‌కేర్‌ ఇన్‌స్టిట్యూట్స్, ఐటీ సంస్థల్లోనూ కొలువులు దక్కించుకోవచ్చు. ఇంజనీరింగ్, టెక్నాలజీకి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, రోబోటిక్స్, ఐఓటీ తదితర విభాగాల్లోనూ ఉజ్వల కెరీర్‌ అవకాశాలు లభిస్తున్నాయి. 

చ‌ద‌వండి: ChatGPT: ఏ ప్రశ్నకైనా సమాధానం 'చాట్‌జీపీటీ' - ఇంటర్వ్యూకి ఇలా సిద్దమైపోండి!

అకడమిక్‌ మార్గాలెన్నో!
స్టెమ్‌ కోర్సుల పరంగా.. మ్యాథమెటిక్స్, సైన్స్‌­లో బీఎస్సీ, ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రోగ్రామ్‌­లు; ఇంజనీరింగ్, టెక్నాలజీలో బీటెక్‌ ప్రోగ్రామ్స్‌ ముందు వరుసలో ఉన్నాయని చెప్పొచ్చు. సీయూఈటీ-యూజీ, పీజీ ఎంట్రన్స్‌లలో ఉత్తీర్ణత ఆధారంగా.. మ్యాథమెటిక్స్, సైన్స్‌కు సంబంధించి సెంట్రల్‌ యూనివర్సిటీల్లో అడుగుపెట్టొచ్చు. జేఈఈ, గేట్‌ ఉత్తీర్ణత ఆధారంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు వంటి ప్రతిష్టాత్మక టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌తోపాటు మరెన్నో ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో బీటెక్, ఎంటెక్‌ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశించొచ్చు.

స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌.. ముఖ్య సమాచారం

  • సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌ల సమాహారమే స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌.
  • దేశ, విదేశాల్లో స్టెమ్‌ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌.
  • అర్హతలను అనుసరించి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనం.
  • దేశంలో.. స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌కు కేరాఫ్‌గా ఐఐటీలు, ఐఐఎస్‌ఈఆర్‌ క్యాంపస్‌లు.
  • సీయూఈటీ-యూజీ, పీజీ; జేఈఈ, గేట్‌ స్కోర్ల ఆధారంగా స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌లోప్రవేశం పొందే అవకాశం.
     
Published date : 15 Dec 2023 06:55PM

Photo Stories