THE World University Rankings: టైమ్స్ జాబితాలో చోటు సాధించిన భారతీయ సంస్థలు ఇవే..

కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్– బెంగళూరు (ఐఐఎస్‌సీ) 96వ ర్యాంకు సొంతం చేసుకుంది. ఇంజనీరింగ్ విభాగంలో సైతం 99వ ర్యాంకులో నిలిచింది. దేశంలో సాంకేతిక విద్యకు ప్రధాన కేంద్రాలుగా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు ఈ జాబితాలో అత్యంత వెనుకబడిపోవటం గమనార్హం. ఒక్క ఐఐటీ కూడా 500 లోపు ర్యాంకు సాధించలేకపోయాయి. వీటికంటే దేశంలోని సంప్రదాయ యూనివర్సిటీలు మంచి ప్రతిభ చూపాయి.
ప్రపంచవ్యాప్తంగా 11,000 వేల సాంకేతిక, ఉన్నత విద్యా సంస్థల్లో బోధన, పరిశోధన ప్రమాణాలు, ఇతర అంశాల ఆధారంగా 2024 సంవత్సరానికి గత ఏడాది అక్టోబర్‌లో ఓవరాల్ ర్యాంకులు కేటాయించగా, తాజాగా సబ్జెక్టు వారీగా ర్యాంకులు ప్రకటించారు. మొత్తం 11 సబ్జెక్టుల్లో ర్యాంకులను వెల్లడించారు. ఓవరాల్ కేటగిరీలో అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) మొదటి స్థానం దక్కించుకుంది.
ఐఐఎస్‌సీ బెంగళూరు 250 లోపు ర్యాంకుల శ్రేణిలో నాలుగు సబ్జెక్టుల్లో ర్యాంకులు సొంతం చేసుకుంది. కంప్యూటర్ సైన్స్‌లో 96, ఇంజనీరింగ్‌లో 99, లైఫ్ సైన్సెస్‌లో 201–250 ర్యాంకుల శ్రేణి, ఫిజికల్ సైన్స్‌లో 201–250 శ్రేణిలో స్థానం సంపాదించింది. సబ్జెక్టువారీ ర్యాంకుల్లో భారత్‌లోని తొలితరం ఐఐటీలుగా పిలిచే ఖరగ్‌పూర్, కాన్పూర్, ఢిల్లీ, ముంబై, రూర్కీ, చెన్నై విద్యా సంస్థలకు అసలు స్థానమే దక్కకపోవటం గమనార్హం.
చదవండి: Faculty Posts: నిట్‌లో అధ్యాపక ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
ర్యాంకుల ప్రామాణికతపై భిన్నాభిప్రాయాలు
టైమ్స్ ర్యాంకుల నిర్ధారణకు ప్రామాణికంగా తీసుకునే అంశాల విషయంలో ఎప్పటి నుంచో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ వంటి ప్రామాణికాలు మన విద్యా సంస్థల పరిస్థితికి సరితూగేలా లేవని విద్యావేత్తలు అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు అమెరికా, బ్రిటన్‌లను తమ గమ్యస్థానాలుగా ఎంచుకుంటున్నారని.. దీంతో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య మన విద్యా సంస్థల్లో తక్కువ ఉంటోందని చెబుతున్నారు. ఈ కారణంగానే భారతీయ విద్యా సంస్థలు ర్యాంకుల్లో వెనుకంజలో ఉంటున్నాయని అంటున్నారు.
5 అంశాలు ప్రామాణికంగా..
ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులు కేటాయించేందుకు టైమ్స్ సంస్థ 5 అంశాలను ప్రామాణికంగా తీసుకుంది. టీచింగ్, పరిశోధన వాతావరణం, పరిశోధన నాణ్యత, ఇండస్ట్రీ ఔట్‌లుక్, ఇంటర్నేషనల్ ఔట్‌లుక్ అనే అంశాలను పరిశీలించి ర్యాంకులు కేటాయించారు. ప్లేస్‌మెంట్స్ (ఉద్యోగాలు), ఫ్యాకల్టీ రిసెర్చ్, ఇండస్ట్రీ కొలాబరేషన్ తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
![]() ![]() |
![]() ![]() |
టైమ్స్ జాబితాలో సబ్జెక్టులవారీగా మొదటి ర్యాంకు సాధించిన సంస్థలు
సబ్జెక్టు |
విద్యా సంస్థ |
కంప్యూటర్ సైన్స్ |
యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ |
ఫిజికల్ సైన్సెస్ |
కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ |
లైఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్, మెడికల్ అండ్ హెల్త్ |
హార్వర్డ్ యూనివర్సిటీ |
సైకాలజీ, న్యాయ శాస్త్రం |
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ |
బిజినెస్ ఎకనామిక్స్, ఆర్ట్స్ – |
|
హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ |
మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ |
ఎడ్యుకేషన్ స్టడీస్ |
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా |
టైమ్స్ జాబితాలో చోటు సాధించిన భారతీయ సంస్థలు
సబ్జెక్టు |
విద్యా సంస్థ |
ర్యాంకుల శ్రేణి |
మెడికల్ అండ్ హెల్త్ |
సవిత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్స్ |
201–300 |
సైకాలజీ |
యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ |
401–500 |
న్యాయ శాస్త్రం |
ఢిల్లీ యూనివర్సిటీ |
301+ |
బిజినెస్ అండ్ ఎకనామిక్స్ |
అమిటీ యూనివర్సిటీ |
401–500 |
ఎడ్యుకేషన్ స్టడీస్ |
ఢిల్లీ యూనివర్సిటీ |
501–600 |
ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ |
ఢిల్లీ యూనివర్సిటీ |
401–500 |
సోషల్ సైన్సెస్ |
లవ్‌లీ ప్రొఫెషనల్ వర్సిటీ |
251–300 |
టైమ్స్ జాబితాలో ఐఐటీల ర్యాంకులు
ఇంజనీరింగ్ విభాగం |
|
గువాహటి, ఇండోర్‌లు |
501–600 |
పాట్నా |
601–800 |
గాంధీనగర్, మండి, రోపార్ |
801–1000 |
కంప్యూటర్ సైన్స్ విభాగం |
|
ఐఐటీ–ఇండోర్ |
401–500 |
ఐఐటీ–పాట్నా |
501–600 |
ఐఐటీ–గాంధీనగర్ |
601 – 800 |
ఐఐటీ – గువాహటి |
801–1000 |
Tags
- IISC Bangalore
- Times Higher Education Rankings
- Computer Science
- Indian Institute of Science Bangalore
- Indian Institute of Technology
- Times Ranks
- Massachusetts Institute of Technology
- Times Higher Education World University Rankings
- IISc Bengaluru enters top 100 club in computer science category
- Times Higher Education subject wise ranking 2025
- Times higher Education
- Top 10 universities in the world
- Best Universities in the World