Skip to main content

Full Stack Developer: ఈ టూల్స్ నేర్చుకుంటే ఫుల్‌ డిమాండ్‌... అర్హతలేంటంటే

full stack developer demand in India, career boost, Tech Path, Opportunities Await

ఐటీ రంగంలో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, వెబ్‌3 మొదలైన టెక్నాలజీల ప్రవేశంతో.. డిజిటల్‌ నైపుణ్యాల పరిధి వేగంగా మారుతోంది. ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది. ఐటీ కంపెనీలు లక్షల వేతనాలతో వీరికి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్లు çఫుల్‌స్టాక్‌ డెవలపర్‌గా కెరీర్‌ ప్రారంభించాలంటే.. ఏయే నైపుణ్యాలు అవసరం, అర్హతలే ంటి? ఫుల్‌స్టాక్‌ డెవలపర్లు ఐటీ సంస్థల్లో నిర్వర్తించే విధులు తదితర వివరాలు.. 

ఒక అప్లికేషన్‌ లేదా వెబ్‌సైట్‌.. ఫ్రంట్‌ ఎండ్, బ్యాక్‌ ఎండ్‌ అభివృద్ధిని ఫుల్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌ అంటారు. ఫుల్‌స్టాక్‌ డెవలపర్లు అప్లికేషన్‌కు సంబంధించిన ప్రోగ్రామింగ్, డిజైన్, డేటా బేసెస్, డీబగ్గింగ్‌ వంటి విధుల్లో కీలకంగా వ్యవహరిస్తారు. అలాగే యూజర్‌ ఎక్స్‌పీరియెన్స్, బిజినెస్‌ లాజిక్, అప్లికేషన్‌ లుక్, ఫంక్షనింగ్‌ల్లో నిష్ణాతులుగా ఉంటారు.

అందుకే అధిక డిమాండ్‌
సాంకేతిక రంగంలో ఫుల్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌ కీలక మైలురాయిగా నిలుస్తోంది. నైపుణ్యాల బృందంగా ఫుల్‌స్టాక్‌ డెవలపర్లను అభివర్ణిస్తున్నారు. వీరు ఫ్రంట్‌ ఎండ్, బ్యాక్‌ ఎండ్‌ ఇంజనీరింగ్‌కు వారధిగా నిలుస్తూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. విభిన్న అప్లికేషన్స్‌కు సంబంధించి అన్ని దశల్లో ఫుల్‌స్టాక్‌ డెవలపర్లు పనిచేయగలరు. ఒక దశకు మరొక దశకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించగలరు. ఆయా డొమైన్లకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ నాలెడ్జ్‌తోపాటు టీమ్‌లో ఏ పనినైనా వీరు చేయగలరు. ఫ్రంట్‌ ఎండ్, బ్యాక్‌ ఎండ్‌ ఇంజనీరింగ్‌పై అవగాహన, పనిచేయగలిగే సామర్థ్యాలు ఫుల్‌స్టాక్‌ డెవలపర్ల సొంతం. అందుకే ప్రస్తుతం ఫుల్‌స్టాక్‌ డెవలపర్లకు జాబ్‌ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ నెలకొంది.

చ‌ద‌వండి: Full Stack Developers: ఫుల్‌ స్టాక్‌ డెవలపర్‌... రూ.లక్షల్లో వార్షిక వేతన ప్యాకేజీలు

నేర్చుకోవాల్సిన టూల్స్‌

  • అప్లికేషన్స్‌కు సంబంధించిన అన్ని స్థాయిల్లో పనిచేయగలిగే ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌గా మారేందుకు బేసిక్‌ టూల్స్‌పై అవగాహనతోపాటు ఆపరేటింగ్‌ సిస్టమ్, వెబ్‌ బ్రౌజర్, టెక్స్‌ట్‌ ఎడిటర్, ఫ్రంట్‌ ఎండ్, బ్యాక్‌ ఎండ్‌ టూల్స్, ప్యాకేజ్‌ మేనేజర్స్, డేటా బేసెస్‌పై పరిపూర్ణ అవగాహన పెంచుకోవాలి. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన అభ్యర్థులు ఫుల్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌ సర్టిఫికేషన్స్, శిక్షణ ద్వారా ఈ విభాగంలో కెరీర్‌ను ప్రారంభించొచ్చు.
  • ఫుల్‌ స్టాక్‌ డెవలపర్‌లు సాఫ్ట్‌వేర్‌ సొల్యూష¯Œ ్స, లాంగ్వేజెస్, డేటాబేస్‌కు సంబంధించిన టెక్నికల్‌ నైపుణ్యాలు నేర్చుకోవాలి. ఫ్రంట్, బ్యాక్‌ ఎండ్‌ వెబ్‌ డెవలపర్‌లకు ఒకే విధమైన సాఫ్ట్‌ స్కిల్స్‌ అవసరం అయినప్పటికీ.. సాంకేతిక సామర్థ్యాలు భిన్నంగా ఉంటాయి. ఫుల్‌స్టాక్‌ వెబ్‌ డెవలపర్‌ విభిన్న ఫ్రేమ్‌వర్క్‌ రకాలపై పని చేయడానికి నిర్దిష్ట నైపుణ్యాలను కలిగి ఉండాలి. 
  • బ్యాక్‌బోన్‌.జేఎస్, కోడ్‌పెన్, విజువల్‌ స్టూడియో కోడ్, టైప్‌ స్క్రిప్ట్, వెబ్‌స్ట్రోమ్, గిట్‌హబ్, స్లాక్, ఎలక్ట్రాన్‌ వంటి టూల్స్‌ నేర్చుకోవాలి. ఫుల్‌స్టాక్‌ డెవలపర్లు వెబ్‌సైట్‌కు సంబంధించిన సమాచారాన్ని డేటాబేసెస్‌ల్లో నిక్షిప్తం చేసి.. అవసరమైనప్పుడు వినియోగించుకుంటారు. దాంతో ఫుల్‌స్టాక్‌ డెవలపర్లకు డేటాబేసెస్, ఒరాకిల్, రెడిస్, మ్యాంగోడీబీ, ఎస్‌క్యూఎల్‌ సర్వర్‌ వంటి నైపుణ్యాలు అవసరమవుతాయి.

ముఖ్యమైన విధులు
ఠిప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన వాటిని సమకూర్చుకోవడం. ఠిడేటాబేసెస్, సర్వర్ల ఏర్పాటు సంబంధిత విషయాలు. ఠిఅప్లికేషన్‌ టెస్టింగ్‌. ఠి వేర్వేరు వేదికల్లో(పరికరాలు)ప్రొడక్ట్‌ను పరీక్షించడం. ఠిఎడిటింగ్‌ అండ్‌ మాడిఫయింగ్‌ కోడ్స్‌ మొదలైనవి.

చ‌ద‌వండి: Industry 4.0: బ్రాంచ్‌ ఏదైనా.. ఈ స్కిల్స్‌పై పట్టు సాధిస్తేనే అవకాశాలు

కంపెనీల మొగ్గు
ఫుల్‌స్టాక్‌ డెవలపర్లను నియమించుకుంటే.. ఆయా టాస్కులకు ప్రత్యేక స్పెషలిస్టుల అవసరం ఉండదు. అందుకే కంపెనీ నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకొనే క్రమంలో ఫుల్‌స్టాక్‌ డెవలపర్ల వైపు సంస్థలు మొగ్గుచూపుతున్నాయి. ఐటీ రంగంలో సాంకేతికత ఎప్పటికప్పుడు మారుతోంది. ఫుల్‌స్టాక్‌ డెవలపర్లు కొత్త టెక్నాలజీని వేగంగా నేర్చుకోవడంలో ముందుంటున్నారు. దాంతో ఫుల్‌స్టాక్‌ డెవలపర్లు కలిగిన కంపెనీలకు రిక్రూట్‌మెంట్, శిక్షణల పరంగా అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే ప్రస్తుతం కంపెనీల తొలి చాయిస్‌ ఫుల్‌స్టాక్‌ డెవలపర్లు అవుతున్నారు.

చ‌ద‌వండి: Career Opportunities After B.Tech: బీటెక్‌ తర్వాత పయనమెటు... ఉన్నత విద్య లేక ఉద్యోగమా?

స్టార్టప్స్‌ ఎంపిక
ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యల పరిష్కారంతోపాటు, అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌కు అవసరమైన అన్ని నైపుణ్యాలను ఫుల్‌స్టాక్‌ డెవలపర్లు కలిగి ఉంటారు. దాంతో స్టార్టప్‌లు సైతం నియామకాల్లో ఫుల్‌స్టాక్‌ డెవలపర్లకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. తద్వారా మొత్తం ఉద్యోగులపై చేసే వ్యయాన్ని తగ్గించుకుంటున్నాయి.
 

Published date : 30 Aug 2023 10:48AM

Photo Stories