Skip to main content

Coding and Programming Skills: ఐటీలో కొలువులు.. లక్షల్లో వేతనం..

Coding and Programming Skills

నేటి యువతలో ఎక్కువ మంది లక్ష్యం.. ఐటీలో కొలువు. లక్షల్లో వేతనం. అకడమిక్‌ డొమైన్‌తో సంబంధం లేకుండా.. ఇంజనీరింగ్, నాన్‌ ఇంజనీరింగ్, సైన్స్, కామర్స్, సోషల్‌ స్టడీస్‌.. ఇలా విభాగం ఏదైనా అధికశాతం మంది విద్యార్థుల దృష్టి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలపైనే ఉంటోంది. కంపెనీలు మాత్రం అభ్యర్థుల్లో కోడింగ్‌ నైపుణ్యాలంటేనే కొలువు అంటున్నాయి. అంటే.. కోడింగ్‌ స్కిల్స్‌లో కింగ్‌ అనిపించుకుంటేనే ఐటీ జాబ్‌ ఆఫర్‌!! ఈ నేపథ్యంలో.. ఐటీ జాబ్‌ మార్కెట్‌ ట్రెండ్స్, కోడింగ్‌ స్కిల్స్‌కు పెరుగుతున్న డిమాండ్, 
నైపుణ్యాలు పెంచుకోవడానికి మార్గాలపై ప్రత్యేక కథనం...

  • టెక్‌ జాబ్‌ ప్రొఫైల్స్‌లో కోడింగ్‌ స్కిల్స్‌కు ప్రాధాన్యం
  • కోర్‌ ఐటీ మొదలు సర్వీస్‌ సెక్టార్‌ వరకు ఇదే ధోరణి
  • సంస్థలు ఆన్‌లైన్‌ బాట పట్టడమే కారణం అంటున్న నిపుణులు
  • కోడింగ్, ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలతోనే ఉజ్వల కెరీర్‌

నేడు అన్ని రంగాలు, సంస్థల్లో డిజిటలైజేషన్‌ ఊపందుకుంది. వినియోగదారులను ఆకట్టుకోవాలంటే.. డిజిటల్‌ టెక్నాలజీ యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండాలి. ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌ను రూపొందించాలంటే.. కోడింగ్, ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌ కీలకం. అందుకే డిజిటల్‌ ఆధారిత సేవలందించే సంస్థలన్నీ కోడింగ్‌ నైపుణ్యాలున్న వారికి పెద్ద పీట వేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

చ‌ద‌వండి: Engineering Special: 'సీఎస్‌ఈ'కే.. సై అంటున్న విద్యార్థులు

అన్ని రంగాల్లో ఐటీ

ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఐటీ ఆధారిత సేవలు విస్తృతమవుతున్న విషయం తెలిసిందే. దీంతో సంస్థలు తమ ఆన్‌లైన్‌ సేవలు మెరుగుపరచుకునేందుకు కోడింగ్‌ ప్రధాన మార్గంగా మారింది. కోర్‌ ఐటీతోపాటు ఎడ్‌ టెక్, హెల్త్‌కేర్, ఫిన్‌టెక్, ఈ -కామర్స్‌ సంస్థల్లోనూ కోడింగ్‌ నిపుణుల అవసరం పెరిగింది. 

కోడింగ్‌ ప్రొఫైల్స్‌లోనే

ప్రస్తుతం అధికశాతం కొలువులు కోడింగ్‌ ప్రొఫైల్‌లోనే ఉంటున్నాయి. పలు రిక్రూటింగ్, స్టాఫింగ్‌ సంస్థల అంచనాల ప్రకారం-ఐటీ రంగంలో దాదాపు 80 శాతం మేర కోడింగ్‌ ప్రొఫైల్స్‌లోనే నియామకాలు జరుగుతున్నాయి. వీరికి ఇచ్చే వేతనాలు కూడా లక్షల్లో ఉంటున్నాయి. లింక్డ్‌ఇన్, టీమ్‌ లీజ్, ఇండీడ్‌ వంటి సంస్థల సర్వేల ప్రకారం-ఐటీ కొలువుల్లో మోస్ట్‌ డిమాండింగ్‌ స్కిల్‌గా కోడింగ్‌ నిలిచింది. ఈ ఏడాది టాప్‌-5 బెస్ట్‌ పేయింగ్‌ జాబ్స్‌లో.. కోడింగ్, ప్రోగ్రామింగ్‌ డెవలపర్‌ ప్రొఫైల్స్‌ చోటు సాధించాయి.

చ‌ద‌వండి: Coding and Programming Jobs: కోడింగ్‌తో కొలువులు.. నైపుణ్యాలు, సొంతం చేసుకునేందుకు మార్గాలు..

క్యాంపస్‌ డ్రైవ్స్‌లోనూ కోడింగ్‌కే

ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర సాంకేతిక ఇన్‌స్టిట్యూట్స్‌లో నిర్వహించే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లోనూ కంపెనీలు కోడింగ్‌ స్కిల్స్‌ ఉన్న వారికే పెద్ద పీట వేస్తున్నాయి. విద్యార్థుల కోడింగ్‌ నైపుణ్యాలు తెలుసుకునేలా పరీక్షలు సైతం నిర్వహిస్తున్నాయి. వాటిలో చూపిన ప్రతిభ ఆధారంగా కొలువులు ఖరారు చేస్తున్నాయి. ఇలా ఆఫర్‌ అందుకున్న వారికి రూ.15 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తోంది.

లభించే జాబ్‌ ప్రొఫైల్స్‌

కోడింగ్‌ స్కిల్స్‌తో ఉద్యోగాలు సొంతం చేసుకున్న వారికి ప్రస్తుతం ఆయా సంస్థల్లో కోడింగ్‌ ప్రోగ్రామర్, ఎగ్జిక్యూటివ్, స్క్రిప్ట్‌ రైటర్, ప్రోగ్రామింగ్‌ టీమ్‌ లీడర్, డిజైన్‌ ఇంజనీర్, డిజైన్‌ ఎగ్జిక్యూటివ్‌ వంటి జాబ్‌ ప్రొఫైల్స్‌ లభిస్తున్నాయి. ఫ్రెషర్స్‌కు ఎంట్రీ లెవల్‌లో ఎగ్జిక్యూటివ్స్‌గా రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వేతనం, పని అనుభవం ఉన్న వారికి రూ.8 లక్షల వరకు వేతనం లభిస్తుంది.

కోడింగ్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌గా

నైపుణ్యాలుంటే.. కోడింగ్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌గా ఫ్రీలాన్సింగ్‌ విధానంలోనూ ఉపాధి పొందే అవకాశం లభిస్తోంది. పలు ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ సంస్థలు, అదే విధంగా స్కిల్‌ అప్‌గ్రేడ్‌ దిశగా అడుగులు వేస్తున్న సంస్థలు.. కోడింగ్‌ విభాగంలో నైపుణ్యం పొందిన వారిని పార్ట్‌ టైమ్‌ లేదా ఫ్రీలాన్సింగ్‌ విధానంలో నియమించుకుంటున్నాయి.

చ‌ద‌వండి: Job Skills: టెక్‌ నైపుణ్యాలతో టాప్‌ కొలువులు.. ప్రత్యేకతలు, నైపుణ్యాలు, భవిష్యత్‌ అవకాశాలు.. 

మేటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌

కోడింగ్‌.. కంప్యూటర్‌ చేయాల్సిన పనిని నిర్దేశిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. కంప్యూటర్‌కు నిర్దేశిత సూచనలు ఇవ్వడమే కోడింగ్‌. కోడింగ్‌నే కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ అంటారు. కోడింగ్‌ లేదా ప్రోగ్రామింగ్‌ కంప్యూటర్‌ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌కు మధ్య అనుసంధాన కర్తగా నిలుస్తుంది. కోడింగ్‌ నైపుణ్యాలు సొంతం చేసుకోవడానికి సీ, సీ++, జావా, ఆర్, పీహెచ్‌పీ, పైథాన్‌ వంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌పై పట్టు సాధించాల్సి ఉంటుంది. వీటితోపాటు హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్, జావాస్క్రిప్ట్, ఎస్‌క్యూఎల్‌ వంటివి కూడా కొలువుల సాధనలో కీలకంగా నిలుస్తున్నాయి.

చ‌ద‌వండి: Tech Skills: పైథాన్‌.. కొలువుల కొండ!

పైథాన్‌

అంతర్జాతీయ స్థాయిలో అత్యధికంగా వినియోగంలో ఉన్న, విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ప్రోగ్రామింగ్‌/కోడింగ్‌ లాంగ్వేజ్‌ ఇది. పలు జాబ్‌ సెర్చ్‌ పోర్టల్స్‌ అంచనాల ప్రకారం-అంతర్జాతీయ స్థాయిలో టాప్‌-3 స్కిల్స్‌ జాబితాలో నిలుస్తోంది. డేటాసైన్స్, మెషిన్‌ లñ ర్నింగ్‌లో పైథాన్‌ కీలకంగా మారుతోంది. ఈ లాంగ్వేజ్‌ నేర్చుకున్న వారికి డెవలపర్స్, డిజైనర్స్‌గా రూ.3 లక్షల నుంచి రూ.5లక్షల వేతనం లభిస్తోంది.

చ‌ద‌వండి: Tech Skills: జావాస్క్రిప్ట్‌.. అవకాశాల జోరు! 

జావా

చాలాకాలంగా వాడుకలో ఉన్న లాంగ్వేజ్‌.. జావా. బిగ్‌ డేటా అప్లికేషన్స్, డెస్క్‌టాప్‌ అప్లికేషన్స్, వెబ్‌ అప్లికేషన్స్‌ రూపకల్పనలో కీలకంగా నిలుస్తోంది. అందుకే ఐటీ దిగ్గజ సంస్థలు జావా నిపుణులకు జాబ్‌ ఆఫర్స్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. ఈ నైపుణ్యాలున్న వారికి జావా ఈఈ డెవలపర్, జావా డెవలపర్, జావా ఆండ్రాయిడ్‌ డెవలపర్‌ వంటి కొలువులు లభిస్తున్నాయి. ప్రారంభంలో సగటు వేతనం రూ.4 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఉంటోంది.

ఆర్‌

కొత్త ఆలోచన రూపకల్పన, గణాంక విశ్లేషణకు ఉపయోగపడుత్ను లాంగ్వేజ్‌ ఆర్‌. డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, మెషీన్‌ లెర్నింగ్, స్టాటిస్టికల్‌ కంప్యూటింగ్, గ్రాఫిక్స్‌ విభాగాల్లో ఆర్‌ లాంగ్వేజ్‌ నిపుణులకు కొలువులు లభిస్తున్నాయి. నైపుణ్యాలుంటే.. ప్రారంభంలోనే సగటున రూ.అయిదు లక్షల వార్షిక వేతనం అందుతోంది. 

పీహెచ్‌పీ

ఓపెన్‌ సోర్స్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌గా పేర్కొనే పీహెచ్‌పీ డెవలపర్స్‌కూ డిమాండ్‌ నెలకొంది. వాస్తవానికి 1990లలోనే ఇది వెలుగులోకి వచ్చినా.. నేటికీ ఇది ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తోంది. ముఖ్యంగా వెబ్‌సైట్స్‌ రూపకల్పనలో ఎక్కువగా పీహెచ్‌పీ లాంగ్వేజ్‌పైనే ఆధారపడుతున్నారు. సగటున రూ. ఆరు లక్షల వార్షిక వేతనం లభిస్తోంది.

స్విఫ్ట్‌

ఓపెన్‌ సోర్స్‌ జనరల్‌ పర్పస్‌ లాంగ్వేజ్‌గా యాపిల్‌ సంస్థ రూపొందించిన స్విఫ్ట్‌ లాంగ్వేజ్‌ను కూడా ఇప్పుడు కంపెనీల్లో వినియోగిస్తున్నారు. ఈ లాంగ్వేజ్‌ స్కిల్స్‌ సొంతం చేసుకున్న వారికి స్విఫ్ట్‌ డెవలపర్స్‌గా సగటున రూ.8 లక్షల వార్షిక వేతనం అందుతోంది. 

చ‌ద‌వండి: Tech Skills: ఎథికల్‌ హ్యాకింగ్‌లో పెరుగుతున్న డిమాండ్‌.. అర్హతలు, నైపుణ్యాలు.. 

నేర్చుకునే మార్గాలివే

ప్రస్తుతం కోడింగ్, ప్రోగ్రామింగ్‌ నేర్చుకునేందుకు పలు మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. జావా, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, రెడ్‌ హ్యాట్, ఐబీఎం వంటి సంస్థలు ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌లో సర్టిఫికేషన్‌ కోర్సులను అందిస్తున్నాయి.

ఆన్‌లైన్‌లోనూ

కోడింగ్‌ నైపుణ్యాలను పెంచుకునేందుకు ఆన్‌లైన్‌ వేదికలు చక్కటి మార్గంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా యూట్యూబ్, వర్చువల్‌ క్లాస్‌ రూమ్స్, లైవ్‌ లెక్చర్స్,వర్చువల్‌ లేబొరేటరీస్‌ను విద్యార్థులు వినియోగించుకోవచ్చు. ఫలితంగా రియల్‌టైం ఎన్విరాన్‌మెంట్‌లో అభ్యసించిన భావన కలుగుతుంది. ముఖ్యంగా ద్వితీయ,తృతీయ శ్రేణి కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఇవి అనుకూలంగా మారుతున్నాయి.

అకడమిక్‌ కోర్సులు

ప్రస్తుతం అకడమిక్‌ స్థాయిలో కోడింగ్, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ను నేర్చుకునే అవకాశం ఉంది. బీటెక్‌ స్థాయిలోనే ఏఐ-ఎంఎల్,ఐఓటీ బ్రాంచ్‌లతో పూర్తి స్థాయి కోర్సులను అందిస్తున్నారు. 2020 విద్యా సంవత్సరం నుంచి ఈ బ్రాంచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఎలక్టివ్స్, మైనర్‌ కోర్సెస్‌గా ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ కూడా ఉన్నాయి.

చ‌ద‌వండి: Tech Skills: జావాస్క్రిప్ట్‌.. అవకాశాల జోరు! 

కోడింగ్‌ స్కిల్స్‌.. ముఖ్యాంశాలు

  • ఐటీ, సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో దాదాపు 70 శాతం మేర కోడింగ్‌ విభాగాల్లోనే ఉద్యోగాలు.
  • లింక్డ్‌ఇన్, టీమ్‌లీజ్, మాన్‌స్టర్‌ డాట్‌ కామ్, ఇండీడ్‌ వంటి సంస్థల అంచనాల ప్రకారం-2022లో అత్యధిక వేతనాలు పొందే ఉద్యోగాల్లో టాప్‌-5లో నిలుస్తున్న కోడింగ్, ప్రోగ్రామింగ్‌ జాబ్‌ ప్రొఫైల్స్‌.
  • నైపుణ్యాలుంటే కనిష్టంగా రూ.అయిదు లక్షల వేతనంతో కెరీర్‌ ప్రారంభించే అవకాశం.
  • ఐబీఎం, సిస్కో, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, గూగుల్‌ సంస్థల ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్స్‌.
  • అకడమిక్‌గానూ బీటెక్‌ స్థాయిలో ఏఐ-ఎంఎల్, ఐఓటీ బ్రాంచ్‌లలో మైనర్‌ సబ్జెక్ట్‌లుగా కోడింగ్, ప్రోగ్రామింగ్‌.

బేసిక్, డిమాండింగ్‌ స్కిల్‌

సాఫ్ట్‌వేర్‌ విభాగంలో కొలువులు కోరుకునే వారికి కోడింగ్‌ అనేది ఒక బేసిక్, డిమాండింగ్‌ స్కిల్‌. కాబట్టి కంప్యూటర్‌ సైన్స్, ఐటీ బ్రాంచ్‌ల విద్యార్థులు కోడింగ్‌ నైపుణ్యాలను తప్పనిసరిగా సొంతం చేసుకోవాలి. విద్యార్థులు తమకు వీలైన రీతిలో (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌) కోడింగ్, ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌ నేర్చుకునే ప్రయత్నం చేయాలి. 
-ప్రొ'' కృష్ణ మోహన్, డీన్, కెరీర్‌ సర్వీసెస్, ఐఐటీ - హైదరాబాద్‌

చ‌ద‌వండి: Degree Jobs In MNC Companies: ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. ఐటీ కొలువు!

Published date : 12 Oct 2022 07:01PM

Photo Stories