Admissions: టెన్త్ సప్లిమెంటరీ విద్యార్థులకూ గురుకులాల్లో సీట్లు
సచివాలయంలో ఆగస్టు 16న జరిగిన జిల్లా గురుకులాల సమన్వయకర్త(డీసీఓ)ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ గురుకులాల్లో ఒక్క సీటు కూడా వృథా కానివ్వొద్దని అధికారులను ఆదేశించారు. Tenth Class సప్లిమెంటరీలో ఉత్తీర్ణులయిన వారికి గురుకులాల్లో అడ్మిషన్లు ఇవ్వకూడదనే నిబంధనను 2022కి సడలించి అడ్మిషన్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. Interలో అదనపు సీట్ల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. గురుకులాల్లో ఎక్కువ డిమాండ్ లేని MEC, CEC సీట్లను MPC, BiPCలుగా మార్చేందుకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి మేరుగ నాగార్జున ఆదేశించారు. వారాంతపు పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా.. విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని సూచించారు. విద్యార్థులు ఏ సబ్జెక్టులో వెనకబడితే.. సంబంధిత సబ్జెక్టు టీచర్ విద్యార్థుల బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. ట్యూటర్లను నియమించాలని.. లైబ్రేరియన్, ఎలక్ట్రీషియన్ ఖాళీలను జిల్లాల స్థాయిలో భర్తీ చేసుకోవడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గురుకులాలు, హాస్టళ్లను అభివృద్ధి చేయాలని ఆదేశాలిచ్చిన సీఎం జగన్‌కు మంత్రి నాగార్జున ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల సంక్షేమం విషయంలో సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. సమావేశంలో గురుకులాల కార్యదర్శి పావనమూర్తి, డిప్యూటీ అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
చదవండి: