Inter Practical Exams 2025 : ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం.. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ ఇలా..

విజయనగరం అర్బన్: ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నేటి నుంచి అంటే, ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 93 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని ఆర్‌ఐఓ మజ్జి ఆది నారాయణ చెప్పారు. అయితే, ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యార్థులు ఇంటర్ విద్యా మండలి ఇప్పటికే విడుదల చేసిందని, వాటిని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారని తెలిపారు ఆయన.
అందుబాటులో హాల్‌టికెట్లు..
ప్రస్తుతం విద్యార్థులకు ఒకేషనల్ ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. ఈ పరీక్షలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. ఎంపీసీ విద్యార్థులు 14,470 మంది, బైపీసీ విద్యార్థులు 4,053 మంది ప్రాక్టికల్ పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. హాల్‌టికెట్లను వారి కళాశాలల లాగిన్‌లోను, 'బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్' వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రకటించారు.
Intermediate Practical Examinations: నేటి నుంచే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు..
పరీక్ష కేంద్రాల్లో పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. విద్యార్థులు తమ పరీక్షలను ప్రకటించిన సమయంలోగా పూర్తి చేయాలన్నారు. ఏమాత్రం ఆందోళన చెందకుండా పరీక్షల్లో పాల్గొనాలని ప్రోత్సాహించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా అధికారులు, ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలని సూచించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- AP Inter Exams 2025
- Practical Exams
- latest updates on inter practical exams
- ap inter public exams 2025
- hall tickets download for inter practicals
- ap inter students
- Intermediate Board
- inter second year students
- inter board exams hall tickets download
- inter exams hall tickets
- ap inter practical exams hall tickets download
- inter students
- online halltickets for practical exams
- Education News
- Sakshi Education News