Skill Hub: విద్యా‍ర్థులకు డిగ్రీతోపాటు ఉద్యోగం..

డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్కిల్‌ హబ్‌ ద్వారా వివిధ వృత్తులలో శిక్షణ కూడా అందిస్తోందన్నారు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి. ఈ సందర్భంగా ఆయన విద్యార్థలతో మాట్లాడారు..

తణుకు టౌన్‌: రాష్ట్రంలోని పేద విద్యార్థులందరికీ ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ఏడెక్స్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నారని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. గురువారం తణుకులోని ఎస్సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ, జేకేసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌ మేళాలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

Jagananna Vidya Deevena Funds Release: పేద పిల్లల కోసమే ‘జగన్నాథ’ రథం కదులుతోంది: పామర్రులో సీఎం జగన్‌

ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో కళాశాల విద్య ప్రాంతీయ సంచాలకులు డాక్టర్‌ సీహెచ్‌ కృష్ణ మాట్లాడుతూ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థి ఒక చేతిలో డిగ్రీ పట్టాతో పాటు మరో చేతిలో ఉద్యోగ నియామక పత్రాన్ని తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జాబ్‌ మేళాను నిర్వహిస్తోందన్నారు. కళాశాలలో ఏర్పాటు చేసిన స్కిల్‌ హబ్‌ ద్వారా వివిధ వృత్తులలో శిక్షణ కూడా అందిస్తోందన్నారు. శిక్షణ అనంతరం పూర్తి స్థాయి నైపుణ్యంతో డిగ్రీ విద్యను పూర్తి చేయాలని చెప్పారు.

Mega DSC 2024: 506 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు

తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నత విద్యలో అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. తణుకు, తాడేపల్లిగూడెం ఎన్‌ఆర్‌సీ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ జాబ్‌ మేళాలో పాల్గొన్నారని చెప్పారు. ఈ జాబ్‌ మేళాలో అపోలో ఫార్మశీ, యాక్సిస్‌ బ్యాంక్‌, అంజనా ఫౌండేషన్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌ తదితర 20 కంపెనీలు పాల్గొన్నట్లు తెలిపారు.

PUC Exams 2024: పీయూసీ పరీక్షలకు సర్వం సిద్ధం.. పరీక్షల తేదీలు ఇవే..

ఈ జాబ్‌ మేళాకు మొత్తం 923 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 283 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని, మరో 300 మంది విద్యార్థులు షార్ట్‌ లిస్ట్‌లో ఉన్నారన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ చేతుల మీదుగా ఆఫర్‌ లెటర్‌ అందజేశారు. కళాశాల సీపీడీసీ కార్యదర్శి సత్తి వెంకట శ్రీనివాసరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ చిట్టూరి వెంకట సుబ్బారావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సూరంపూడి కామేష్‌, నిడదవోలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రుద్ర, ప్రభుత్వ డిగ్రీ కళాశాల జేకేసీ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ టి.సంధ్యారాణి పాల్గొన్నారు.

Agriculture Course: ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్న వ్యవసాయం కోర్సులు..

#Tags